హీరో సూర్యకు భల్లాల దేవుడి సాయం!

Published : Jul 05, 2019, 03:47 PM IST
హీరో సూర్యకు భల్లాల దేవుడి సాయం!

సారాంశం

తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇక విలక్షణమైన నటనతో దగ్గుబాటి రానా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇక విలక్షణమైన నటనతో దగ్గుబాటి రానా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సూర్య చిత్రానికి రానా సాయం చేయబోతున్నాడు. 

రానా  చేతుల మీదుగా సూర్య లేటెస్ట్ మూవీ బందోబస్త్ టీజర్ రిలీజ్ కానుంది. జులై 6 సాయంత్రం 6 గంటలకు రానా బందోబస్త్ టీజర్ ని రిలీజ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని బందోబస్త్ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. 

కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరక్కుతున్న బందోబస్త్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సూర్య, కెవి ఆనంద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వీడొక్కడే, బ్రదర్స్ లాంటి చిత్రాలు వచ్చాయి. ఉగ్రవాదం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

దిగ్గజ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బందోబస్త్ చిత్ర ప్రచార కార్యక్రమాలు కూడా క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ అయింది. ఇప్పుడు టీజర్ ని రానాతో రిలీజ్ చేయిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది