ఆ స్టార్ హీరోయిన్ ని చూసి చేతిలో ఉన్న బాటిల్ పగలగొట్టేశా.. అంత కోపం వచ్చింది, రానా షాకింగ్ కామెంట్స్

Published : Aug 13, 2023, 10:06 PM ISTUpdated : Aug 13, 2023, 10:07 PM IST
ఆ స్టార్ హీరోయిన్ ని చూసి చేతిలో ఉన్న బాటిల్ పగలగొట్టేశా.. అంత కోపం వచ్చింది, రానా షాకింగ్ కామెంట్స్

సారాంశం

హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్.. మహానటి, సీతా రామం, కనులు కనులని దోచాయంటే లాంటి హిట్ చిత్రాలతో తెలుగువారికి కూడా చేరువయ్యాడు. తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్.. మహానటి, సీతా రామం, కనులు కనులని దోచాయంటే లాంటి హిట్ చిత్రాలతో తెలుగువారికి కూడా చేరువయ్యాడు. తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ నటించే ప్రతి చిత్రం తెలుగులో కూడా విడుదలవుతోంది. చాలా మంది టాలీవుడ్ నిర్మాతలు దుల్కర్ తో స్ట్రైట్ మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

తాజాగా దుల్కర్ నటించిన లేటెస్ట్ మూవీ 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.  ఈ చిత్రంలో రితిక సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనికా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ప్రీ రిలీజ్ వేడుకకి నేచురల్ స్టార్ నాని, భల్లాల దేవుడు రానా అతిథులుగా హాజరయ్యారు. రానా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

దుల్కర్ సల్మాన్ తెలుగువారిలానే అనిపిస్తారు. తెలుగులో సినిమాలు చేయడం సంతోషించ దగ్గ విషయం. దుల్కర్ చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పాలంటే ఒక సంఘటన గురించి చెప్పాలి. దుల్కర్ ఒక హిందీ చిత్రంలో నటిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ నా స్నేహితులే కావడంతో లొకేషన్ కి వెళ్ళాను. ఆ చిత్రంలో బాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరోయిన్ నటిస్తోంది. 

టేక్ జరుగుతుండగా ఆ హీరోయిన్ మధ్యలో తన భర్తతో ఫోన్ లో మాట్లాడుతోంది. అది అర్జెంటు విషయం కూడా కాదు. వాళ్ళ హస్బెండ్ లండన్ లో షాపింగ్ చేస్తున్నారట.. ఈవిడ దానిగురించి మాట్లాడుతోంది. టేక్ జరుగుతున్నప్పుడు డైలాగ్ సరిగ్గా చెప్పడం లేదు. ఆమె వల్లే టేక్స్ టేక్స్ వేస్ట్ అవుతున్నాయి. కానీ దుల్కర్ మాత్రం ఆమెని ఏమీ అనకుండా ఓపిగ్గా చేస్తున్నాడు. 

ఆమె తీరుకి నాకే కోపం వచ్చి చేతిలో ఉన్న బాటిల్ పగలగొట్టా. ఆమె వెళ్ళాక నిర్మాతలని ఇష్టం వచ్చినట్లు తిట్టేశా. కానీ దుల్కర్ మాత్రం సహనంతో ఉన్నారు. అది దుల్కర్ వ్యక్తిత్వం అని రానా తెలిపాడు. ఆ హీరోయిన్ పేరు మాత్రం రానా చెప్పలేదు. పెళ్ళైన హీరోయిన్స్ తో దుల్కర్ నటించింది సోనమ్ కపూర్ తో అని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ జోయా ఫ్యాక్టర్ అనే చిత్రంలో నటించారు.  బహుశా రానా చెప్పింది ఆమె గురించే అయి ఉంటుంది అని నెటిజన్లు అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా