సీనియర్ నటుడి కుమార్తెతో పెళ్ళికి రెడీ అవుతున్న హీరో.. మూవీ పూర్తి కాకముందే ప్రేమలో..  

By Asianet News  |  First Published Aug 13, 2023, 7:41 PM IST

తాజాగా కోలీవుడ్ లో ఓ జంట ప్రేమ పెళ్ళికి రంగం సిద్ధం అయింది. వైవిధ్యభరితమైన చిత్రాలతో యువ హీరో అశోక్ సెల్వన్ గుర్తింపు పొందాడు. రీసెంట్ గా అశోక్ సెల్వన్ 'పోర్ తళిల్' అనే థ్రిల్లర్ మూవీ తో హిట్ కొట్టాడు.


చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు సహజమే. టాలీవుడ్ లో త్వరలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ లో ఓ జంట ప్రేమ పెళ్ళికి రంగం సిద్ధం అయింది. వైవిధ్యభరితమైన చిత్రాలతో యువ హీరో అశోక్ సెల్వన్ గుర్తింపు పొందాడు. 

రీసెంట్ గా అశోక్ సెల్వన్ 'పోర్ తళిల్' అనే థ్రిల్లర్ మూవీ తో హిట్ కొట్టాడు. అంతకు ముందు 'ఓ మై కడవులే' చిత్రం కూడా విజయం సాధించింది. త్వరలో ప్రస్తుతం ఈ యంగ్ హీరో వయసు 33 ఏళ్ళు. అశోక్ సెల్వన్ త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ నుంచి విశ్వసనీయ వార్తలు వస్తున్నాయి. 

Latest Videos

అశోక్ సెల్వన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా హీరోయినే కావడం విశేషం. ఆమె ఎవరో కాదు తమిళ సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్. మరో విశేషం ఏంటంటే వీరిద్దరూ ప్రస్తుతం జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తి కాకముందే ఇద్దరూ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. 

 

అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 13న వీరిద్దరి వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. కీర్తి పాండియన్ తుంబా, అంబిర్కినియల్ చిత్రాలతో హీరోయిన్ గా గుర్తింపు పొందింది.కీర్తి పాండియన్ సోషల్ మీడియాలో తరచుగా హాట్ హాట్ ఫోజులతో యువతని ఆకర్షిస్తూ ఉంటుంది. 

బికినీల్లో సైతం కీర్తి పాండియన్ మంటలు రేపే ఫోజులు ఇస్తోంది. చీరకట్టు అయినా, ట్రెండీ డ్రెస్సుల్లో అయినా కీర్తి పాండియన్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. హీరోయిన్ గా కూడా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. ఇలాంటి తరుణంలో కీర్తి.. అశోక్ సెల్వన్ తో ప్రేమలో పడడం పెళ్ళికి సిద్ధం అవుతుండడం ఆసక్తిగా మారింది. 

click me!