కమల్‌ హాసన్‌ కి రానా అదిరిపోయే కౌంటర్‌.. ఆర్టిస్ట్ ల పని ఎంటర్‌టైన్‌ చేయడమే, సమాజానికి దారి చూపడం కాదు

Published : Jun 05, 2025, 11:41 PM IST
rana, kamal haasan

సారాంశం

ఆర్టిస్ట్ లు సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొందించాలి. విడగొట్టేలా మాట్లాడకూడదు. ప్రతి భాషకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంటుంది. దాన్ని గౌరవించాలని హీరో రానా అన్నారు.

 కమల్ హాసన్ కన్నడ, తమిళ భాషల గురించి చేసిన వ్యాఖ్యలపై రానా దగ్గుబాటి స్పందించారు. నటుల ముఖ్య పని ఎంటర్‌టైన్‌ చేయడమే తప్ప, సమాజం ఎలా బతకాలో చెప్పడం కాదన్నారు.

కమల్‌ హాసన్‌ కన్నడ వివాదం నేపథ్యం

`థగ్‌ లైఫ్‌` సినిమా ఆడియో వేడుకలో కమల్ హాసన్.. తమిళనాడు సంస్కృతి, భాషా ప్రత్యేకత గురించి మాట్లాడారు. కన్నడ లాంటి భాషలు తమిళం నుంచి ఉద్భవించాయన్నట్టుగా ఆయన మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. ఇది కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో `థగ్‌ లైఫ్‌` సినిమా బ్యాన్ చేయడం వరకు వెళ్లింది. 

కమల్‌ వివాదంపై రానా దగ్గుబాటి  పరోక్ష స్పందన 

"కళాకారులు సమాజం ఎలా బతకాలో చెప్పేవాళ్ళం కాదు. భాషా విధానాలు రూపొందించేవాళ్ళం కాదు. మా పని ప్రజల్ని అలరించడం. ఎవరు ఏ భాష మాట్లాడాలి, ఏ సంస్కృతి పాటించాలో మనం నిర్ణయించకూడదు" అని రానా అన్నారు.

"ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారత సినిమా అనే తేడా లేదు. మనమంతా భారతీయ సినిమా అనే ఒకే వేదికపై ఉన్నాం. కథ బావుంటే ఏ భాషలోనైనా ఆదరిస్తారు. భాష ఒక మాధ్యమం మాత్రమే. కథ, చెప్పే విధానం ముఖ్యం" అని రానా అభిప్రాయపడ్డారు.

రానా తన మాటలకు ఉదాహరణగా, "మరాఠీకి చెందిన రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్. కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్ దక్షిణాది, హిందీ భాషల్లో నటించారు. నేనూ అన్ని భాషల్లో నటిస్తున్నా. కళాకారులకు భాషా భేదం లేదు" అని వివరించారు.

"కళాకారులు సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొందించాలి. విభజన కలిగించేలా మాట్లాడకూడదు. ప్రతి భాషకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంటుంది. దాన్ని గౌరవించాలి" అని రానా సూచించారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.  కమల్‌ కి రానా కౌంటర్‌ అదిరిపోయిందంటున్నారు నెటిజన్లు. 

ఇక రానా ప్రస్తుతం తన బాబాయ్‌ వెంకటేష్‌ తో కలిసి `రానా నాయుడు` సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. దీని ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఈ నెల 13న నెట్‌ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఒక్క రాత్రికి 3 కోట్లు.. శిల్పా శెట్టి రెస్టారెంట్ ఆదాయం తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే ?
గేమ్ ఛేంజర్ హీరోయిన్ భర్త ఆస్తి ఎంతో తెలుసా ? లగ్జరీ హౌస్ వివరాలు ఇవే