అమీర్ ఖాన్ సూపర్ హీరో మూవీ.. డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే మతిపోవాల్సిందే, అదిరిపోయే కాంబో

Published : Jun 05, 2025, 11:28 PM IST
aamir khan

సారాంశం

దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఇప్పుడు రజనీకాంత్‌తో `కూలీ` మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో భారీ స్టార్‌ కాస్టింగ్‌ నటిస్తోంది. అమీర్‌ ఖాన్‌ కూడా కనిపిస్తారట. కానీ త్వరలో అమీర్‌తోనే మూవీ ప్లాన్‌ చేస్తున్నారు లోకేష్‌.

`సితారే జమీన్‌ పర్‌` చిత్రంతో రాబోతున్నారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌. దీంతోపాటు ఆయన సౌత్‌లో `కూలీ` చిత్రంలో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. సినిమాని మలుపు తిప్పే పాత్రలో ఆయన కనిపిస్తారట. 

లోకేష్‌ కనగరాజ్‌తో సూపర్‌ హీరో మూవీ 

ఈ క్రమంలో ఇప్పుడు అమీర్‌ ఖాన్‌ ఓ సూపర్‌ హీరో మూవీ చేయబోతున్నారట.  తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారట. పిటిఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఈ విషయం చెప్పారు. 

లోకేష్ తో కలిసి ఓ సూపర్ హీరో సినిమా చేస్తున్నట్టు, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలిపారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 'పీకే' సినిమాకి సీక్వెల్ వస్తుందన్న వార్తలను అమీర్ ఖండించారు. హిరానీతో కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేస్తున్నట్టు చెప్పారు.

`పీకే 2` కాదు దాదాసాహెబ్‌ఫాల్కే బయోపిక్‌

'పీకే 2' వార్తలు కేవలం పుకార్లేనని, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం పనిచేస్తున్నామని అమీర్ స్పష్టం చేశారు. చాలా కాలంగా తాను కలలు కంటున్న `మహాభారతం` ప్రాజెక్ట్ గురించి కూడా ఆయన మాట్లాడారు. 

`మహాభారతం` సినిమా తీయడం అంటే కేవలం సినిమా తీయడం కాదని, ఒక తపస్సు లాంటిదని ఆయన అన్నారు. ఆ ప్రాజెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నానని, కానీ అది సాధ్యమవుతుందో లేదో తెలియదని ఆయన చెప్పారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?