రానా నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్‌ తోనే.. ఇక `హిరణ్య కశ్యప`, `నేనే రాజు` సీక్వెల్‌ లేనట్టే?

Published : Dec 06, 2023, 05:34 PM IST
రానా నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్‌ తోనే.. ఇక `హిరణ్య కశ్యప`, `నేనే రాజు` సీక్వెల్‌ లేనట్టే?

సారాంశం

రానా గతేడాది `విరాట పర్వం` చిత్రంతో వచ్చాడు. ఈ సినిమా ఆడలేదు. ఆ తర్వాత సినిమా ఏంటనే కన్‌ప్యూజన్‌ నెలకొంది. తాజాగా ఓ సరికొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

రానా హీరోగా కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గానే బిజీగా ఉంటున్నారు. అది కూడా చాలా సెలక్టీవ్‌గా ఉంటున్నాడు. చివరగా ఆయన `విరాటపర్వం` చిత్రంతో అలరించారు. ఈ మూవీ ఆడలేదు. ఈ సినిమా వచ్చి ఏడాది దాటింది. ఆ తర్వాత ఆయన్నుంచి సినిమా రాలేదు. మధ్యలో `హిరణ్యకశ్యప` ప్రకటించారు. త్రివిక్రమ్‌ కథ, మాటలు అందిస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై పెద్ద వివాదం జరిగింది. గుణశేఖర్‌ఈ ప్రాజెక్ట్ పై చాలా ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌ ట్రాక్‌లోకి రావడం పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత అంతా సైలెంట్‌ అయ్యారు. 

ఇక ఇప్పటి వరకు రానా హీరోగా సినిమాలు ప్రకటించలేదు. తాజాగా ఇద్దరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయట. ఇటీవల `దయా` వెబ్‌ సిరీస్‌తో విజయాన్ని అందుకున్న దర్శకుడు పవన్‌ సాధినేనితో సినిమా చేయబోతున్నారట. ఇది చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది. థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండబోతుందట. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందట. 

మరోవైపు ఆర్కా మీడియాలోనూ ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయట. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగుందని, దానిపై వర్క్ జరుగుతుందని, ఇది స్క్రిప్ట్ ఫైనల్‌ అయితే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందట. ఇక నెక్ట్స్ రానా చేయబోయేది పవన్‌ సాధినేని ప్రాజెక్ట్ అని, ఆ తర్వాత ఆర్కా మీడియా లొ సినిమా ఉంటుందని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇక రానా.. నటించాల్సిన `హిరణ్య కశ్యప`ని పక్కన పెట్టారని తెలుస్తుంది. గుణశేఖర్‌ దీనిపై వివాదం చేయడంతో అంతా సైలెంట్‌ అయ్యారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ లేనట్టే అంటున్నారు. అంతేకాదు తేజ దర్శకత్వంలోనూ రానా సినిమా చేయాల్సింది. `నేనే రాజు నేనే మంత్రి`కి సీక్వెల్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇప్పటికే పట్టాలెక్కాల్సింది. కానీ తేజ.. రానా తమ్ముడు అభిరామ్‌తో ఆ మధ్య ఓ సినిమా చేశాడు. ఇది ఘోర పరాజయం చెందింది. పాత కథ, హీరో సెట్‌ కాకపోవడంతో డిజాస్టర్‌ అయ్యింది. ఈ ఫలితం చూశాక `నేనే రాజు నేనే మంత్రి` సీక్వెల్‌ని కూడా పక్కన పెట్టారని సమాచారం. దీంతో వాటిని వదిలేసి రానా కొత్త కథలపై కూర్చుంటున్నారట. చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ