త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న రానా నాయుడు 2, ఎక్కడ చూడొచ్చంటే?

Published : May 20, 2025, 09:13 PM IST
Rana Daggubati and Venkatesh starrer Rana Naidu 2

సారాంశం

విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ రెండో సీజన్ రిలీజ్‌కు రెడీ అయ్యింది ఇంతకీ ఈ సిరీస్ ను ఎప్పుడు ఎక్కడ చూడవచ్చంటే? 

ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రెండో సీజన్ రిలీజ్‌కు సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ మూవీ ఫస్ట్ సీజన్‌కి ప్రేక్షకుల నుంచి వచ్చిన విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని, మేకర్స్ ఇప్పుడు సీజన్ 2ని మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు.

‘రానా నాయుడు సీజన్ 2’ జూన్ 13నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అత్యధికంగా వీక్షించబడిన బ్రేక్అవుట్ హిట్‌లలో ఒకటిగా నిలిచిన ఈ సిరీస్, ప్రస్తుతం సీజన్ 2తో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.

ఈ సిరీస్‌ను సుందర్ ఆరోన్ ఆధ్వర్యంలోని లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా, కరణ్ అన్షుమాన్ దీనిని క్రియేట్ చేశారు. దర్శకత్వ బాధ్యతలను కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా తీసుకున్నారు.

ఇక ఈ సీజన్ 2లో నటించిన వారిలో, రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా ఉన్నారు.

ఇవాళ్టి డిజిటల్ యుగంలో వాస్తవికత , కుటుంబ సంబంధాల మధ్య సాగే ఈ డార్క్ థ్రిల్లర్ డ్రామా, క్రైమ్, ఎమోషనల్ కాన్టెంట్‌తో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోనుంది. ముంబయి నేపథ్యంతో సాగే కథల హీరోలు తండ్రి-కొడుకుల మధ్య ఉన్న సంబంధాలను సమర్ధవంతంగా చూపించారు.

రానా నాయుడు 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం ఇది ఖచ్చితంగా ఓ పెద్ద అప్‌డేట్. జూన్ 13 నుండి ఈ వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా వీక్షించవచ్చు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ