రానా దగ్గుబాటి - డైరెక్టర్ తేజ కాంబోలో భారీ ప్రాజెక్ట్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

By Asianet News  |  First Published May 24, 2023, 3:35 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) నెక్ట్స్  సినిమాపై అప్డేట్ అందింది. మరోసారి డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. 
 


టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) నెక్ట్స్  సినిమాపై అప్డేట్ అందింది. ‘బాహుబలి’  తర్వాత రానాకు స్పెషల్ ఇమేజ్ పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రానా సరికొత్త ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విభిన్న పాత్రలతో అలరిస్తున్నారు. రీసెంట్ ఎవరూ వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించారు. ‘రానా నాయడు’ సిరీస్ కు మంచి రెస్పాన్సే దక్కింది.

ఇక రానా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో, ఎలాంటి మూవీ రాబోతుందనేది ఆడియెన్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలో అదిరిపోయే అప్డేట్ అందింది. రానా - డైరెక్టర్ తేజ (Teja)  కాంబినేషన్ లో మరో చిత్రం రానుందని కన్ఫమ్ అయ్యింది. రానా నెక్ట్స్ మూవీ ఇదేనంట. త్వరలో పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత అచంట గోపీనాథ్ నిర్మించనున్నారు.

Latest Videos

రానా- తేజ కాంబినేషన్ లో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. 20017లో ఈ చిత్రం విడుదలైంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీకి అప్పుడు భారీ రెస్పాన్స్  దక్కింది. దాంతర్వాత మళ్లీ ఇప్పుడు వీరి కాంబో సెట్ అయ్యింది. భారీ స్థాయిలో సినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. 

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ‘అహింస’ అనే చిత్రం రూపుదిద్దుకుంది. రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా వస్తోంది. గీతికా తివారీ హీరోయిన్. సదా ముఖ్య పాత్ర పోషిస్తోంది. జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రస్తుతం తేజ ఈ చిత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న క్రమంలో ఆసక్తికరమైన విషయాలనూ వెల్లడిస్తున్నారు. 
 

click me!