ప్రముఖ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny Vas) అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఐకాన్ స్టార్ రాబోయే చిత్రాల గురించి అదిరిపోయే అప్డేట్ అందించారు. పుష్ప2 రిలీజ్ గురించి మాట్లాడారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న Pushpa 2లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘పుష్ప : ది రైజ్’కు ఇది స్వీకెల్. ప్రస్తుతం ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత బన్నీవాసు అదిరిపోయే అప్డేట్ అందించారు. ఇఫ్పటికే చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన #where is pushpaతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కు దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం అభిమానులు ‘పుష్ప2’ రిలీజ్ ఎప్పుడనేది, అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుందనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. ప్రొడ్యూసర్ బన్నీ వాసు (Bunny Vas) ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మూవీస్ కు సంబంధించిన అప్డేట్స్ ను అందించారు. ‘పుష్ఫ2’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. Pushpa The Rise కూడా 2021లో డిసెంబర్ నెలలోనే విడుదలవడం గమనార్హం. మళ్లీ అదే నెలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే అల్లు అర్జున్ - ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఓ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరో ప్రాజెక్ట్ కూడా రాబోతుందని బన్నీవాస్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ‘పుష్ప2’ రిలీజ్ తర్వాత 2024లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ప్రారంభం కానుందని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అయితే, గీతా ఆర్ట్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లలో అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ప్రారంభం కానుందని తెలిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ అని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ తో బన్నీ నాలుగో సినిమా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని బన్నీ వాసు ఇచ్చిన అప్డేట్ తో కన్ఫమ్ అవుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనసూయ, సునీల్, అజయ్ ఘోష్ తో పాటు తదితర నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.