మా బాబాయ్ హీరో.. స్టార్ కిడ్ అని పిలవకండి.. రానా!

By tirumala ANFirst Published Jun 18, 2019, 2:31 PM IST
Highlights

చిత్ర పరిశ్రమలో నెపోటిజం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏమాత్రం అర్హత, ప్రతిభ లేనివాళ్లు కూడా సినీ బ్యాగ్రౌండ్ ఉన్నందువల్ల దర్శకులు, నటులు అయిపోతున్నారని, నిజమైన టాలెంట్ మరుగున పడిపోతోందనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. 

చిత్ర పరిశ్రమలో నెపోటిజం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏమాత్రం అర్హత, ప్రతిభ లేనివాళ్లు కూడా సినీ బ్యాగ్రౌండ్ ఉన్నందువల్ల దర్శకులు, నటులు అయిపోతున్నారని, నిజమైన టాలెంట్ మరుగున పడిపోతోందనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఓ బాలీవుడ్ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో రానా నెపోటిజం గురించి స్పందించాడు. 

ప్రతిభ నిరూపించుకున్న వారిని స్టార్ కిడ్స్ అంటూ అవమానించేలా వ్యాఖ్యలు చేయకూడదని రానా తెలిపాడు. రానా మాట్లాడుతూ.. ఓ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఉత్తమ దర్శకుల్ని, ఉత్తమ నటుల్ని తయారు చేసే స్కూల్స్ ఎక్కడా లేవు. మన ప్రతిభతో మనమే ఎదగాలి. ఓ తండ్రికి రసాయన కర్మాగారం ఉందనుకోండి.. అయన కొడుకుకి అందులో అన్ని విషయాలు తెలుస్తాయి. తమ కంపెనీలో ఎలాంటి రసాయనాలు తయారవుతున్నాయి.. పెట్టుబడి ఎంత లాంటి విషయాల్లో అవగాహన ఉంటుంది. 

మీరంటున్న స్టార్ కిడ్స్ కూడా అంతే. మా నాన్నా నిర్మాత. బాబాయ్ హీరో. మా అమ్మ ఫిలిం లాబ్స్ చూసుకునేవారు. కాబట్టి నాకు సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు అర్థమయ్యేవి అని రానా తెలిపాడు. స్టార్ కిడ్స్ అని, నేపోటిజం అని అవమానంగా మాట్లాడకూడదు. అనుభవం ఉన్న వారు అని సంభోదిస్తే బావుంటుందని రానా అభిప్రాయ పడ్డాడు. 

రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్. విలక్షణమైన నటన, విభిన్న చిత్రాలతో రానాకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. 

click me!