శర్వానంద్ కి సర్జరీ.. డాక్టర్స్ ఏమన్నారంటే..?

By AN TeluguFirst Published 18, Jun 2019, 2:20 PM IST
Highlights

టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో '96' సినిమా రీమేక్ ను రూపొందిస్తున్నారు. 

టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో '96' సినిమా రీమేక్ ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో శర్వానంద్ భుజం, కాలికి గాయాలయ్యాయి.

షోల్డర్ బోన్ డిస్ లొకేట్ అవ్వడంతో వెంటనే శర్వానంద్ థాయ్ లాండ్ నుండి హైదరాబాద్ చేరుకొని సన్ షైన్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సోమవారం నాడు సన్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గురవారెడ్డి ఆద్వర్యంలో శర్వా భుజానికి శస్త్ర చికిత్స చేశారు. నాలుగు గంటల పాటు సర్జరీ, ఐదు గంటల పాటు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది.

ఆపరేషన్ తరువాత మూడు గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆ తరువాత రూమ్ కి షిఫ్ట్ చేశారు. శర్వా ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గురవారెడ్డి వివరించారు. శర్వాకి జరిగిన ప్రమాదం కారణంగా తన షోల్డర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని, అది ఐదారు ముక్కలుగా అవ్వడంతోనాలుగు గంటల పాటు శస్త్ర చికిత్సకి సమయం పట్టిందని అన్నారు.

పరిస్థితి మామూలు కావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. రెండు నెలల పాటు ఫిజియోథెరపీ అందిస్తామన్నారు. కాలిలో చిన్న ఫ్రాక్చర్ ఉందని, దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని, త్వరగానే కోలుకుంటాడని చెప్పారు. 

Last Updated 18, Jun 2019, 2:20 PM IST