
కృష్ణ పార్థీవ దేహాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం బుధవారం పద్మాలయా స్టూడియోలో ఉంచారు. పెద్ద ఎత్తున చిత్ర ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అభిమానులను సైతం అనుమతించడం జరిగింది. ఇక కృష్ణ కన్నుమూశాక తదనానంతర కార్యక్రమాలు నరేష్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కృష్ణకు నివాళులు అర్పించేందుకు వచ్చిన అతిథులను పలకరించడం, ఆహ్వానించడం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు అనుకోని అతిథి తారసపడింది. రమ్య రఘుపతి కృష్ణను కడసారి చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నరేష్-పవిత్ర లోకేష్ ముఖం వెలవెలబోయిందట.
నరేశ్ భార్యగా కృష్ణతో ఆమెకు అనుబంధం ఉంది. దీంతో మామయ్య కృష్ణ మరణం ఆమెను వేదనకు గురి చేసింది. కడసారి ఆయన్ని చూసేందుకు కర్ణాటక నుండి వచ్చారు. రమ్య రఘుపతి ఎదురుపడటంతో నరేష్, పవిత్ర లోకేష్ ఇబ్బందిగా ఫీల్ అయ్యారట. కొద్ది నెలల క్రితం వీరి మధ్య పెద్ద హైడ్రామా నడిచింది.
పవిత్ర లోకేష్ ని నరేష్ వివాహం చేసుకున్నారని భావించిన రమ్య రఘుపతి ఫైర్ అయ్యారు. నాకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను నరేష్ ఎలా వివాహం చేసుకుంటాడు, సంబంధం పెట్టుకుంటాడు అంటూ ధ్వజమెత్తారు. మైసూర్ హోటల్ గదిలో నరేష్-పవిత్ర ఉన్నారన్న విషయం తెలుసుకొని రమ్య ఆ గది ముందు బైఠాయించింది. అక్కడ నిరసన చేపట్టింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చీ, నరేష్, పవిత్రలను అక్కడ నుండి పంపేశారు. రమ్య చెప్పుతో దాడి చేయబోయారు.
రమ్య రఘుపతిఫై నరేష్ అనేక ఆరోపణలు చేశారు. ఆమె డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టిందని వెల్లడించారు. పవిత్ర లోకేష్ ని నేను పెళ్లి చేసుకోలేదు. మేము సహజీవనం చేస్తున్నామని స్పష్టత ఇచ్చారు. రమ్య రఘుపతితో విడిపోయిన నరేష్ నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు.