షూటింగ్ అయ్యాక ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని: రమ్యకృష్ణ

By Udayavani DhuliFirst Published Jan 21, 2019, 5:00 PM IST
Highlights

నటి రమ్యకృష్ణ సినీ కెరీర్ ఆరంభంలో మానసికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 17 ఏళ్ల వయసులో 'ముతల్ వసంతం' అనే సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అనుకోకుండా పదిహేను అడుగుల లోతులో కాలుజారి పడిపోయారట రమ్యకృష్ణ. 

తన కాలి మడమ విరగడంతో నడవలేని పరిస్థితి. అప్పుడు ఆ సినిమా హీరో హాస్పిటల్ లో జాయిన్ చేశారని, కర్రల సహాయంతో షూటింగ్ కి వెళ్లిన విషయాలను గుర్తుచేసుకున్నారు. 'ముతల్ వసంతం'తో పాటు 'విళంగు', 'సంకీర్తన'సినిమాలు కూడా ఒప్పుకోవడంతో కాలికి మందులు రాస్తూనే షూటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు.

విపరీతమైన నొప్పి ఉండడంతో షూటింగ్ అయిన తరువాత రోజు ఇంటికి వెళ్లి ఏడ్చేవారట. ఆ గాయం కారణంగా మూడు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. స్టీల్ రాడ్లు పెట్టి మడమ భాగాన్ని అతికించినట్లు వెల్లడించారు.  

అయితే కాలికి గాయం తగిలిందని కొందరు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ తీసేసుకున్నారట. ఆ సమయంలో మానసికంగా.. శారీరకంగా మరింత దృఢంగా అయ్యానని తెలిపారు రమ్యకృష్ణ. 'సంకీర్తన' సినిమా తరువాత స్టార్ అయ్యానని, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసినట్లు చెప్పుకొచ్చారు. 

click me!