భారీ చిత్రాలను దిల్ రాజు దూరం పెడుతున్నాడా..?

By Udayavani DhuliFirst Published Jan 21, 2019, 4:27 PM IST
Highlights

నిర్మాతగా తన బ్యానర్ పై భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ లాభాలను పొందుతున్నాడు దిల్ రాజు. రీసెంట్ గా ఆయన నిర్మించిన 'ఎఫ్ 2' సినిమా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం దిల్ రాజు చేతుల్లో 'మహర్షి' అనే భారీ బడ్జెట్ సినిమా ఉంది. 

ఈ సినిమా తరువాత లైన్ లో చాలానే ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అయితే కొన్నాళ్లపాటు పెద్ద సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడట దిల్ రాజు. '96' సినిమా రీమేక్ చేయబోతున్నాడు. ఇందులో శర్వానంద్, సమంత నటించనున్నారు. ఈ సినిమాతో పాటు నాని-ఇంద్రగంటి కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

అనీల్ రావిపూడితో కూడా సినిమా ఉంది కానీ దానికి టైమ్ పట్టేలా ఉంది. ఈలోగా మీడియం రేంజ్ హీరోలు ఎవరు దొరికితే వాళ్లతో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నుండి నాగచైతన్య వరకు చాలా మంది హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ముప్పై కోట్ల బడ్జెట్ లోనే సినిమాలు చేయాలే తప్ప అంతకుమించి పెట్టుబడి పెట్టకూడదని అనుకుంటున్నాడట. 

బన్నీ తో అనుకున్న సినిమాను కూడా ఇప్పుడు పక్కన పెట్టినట్లు సమాచారం. ఒకట్రెండు తప్ప ఇప్పటివరకు దిల్ రాజు బ్యాకర్ లో వచ్చే మీడియం బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలు సాధించాయి. ఆ కారణంగానే దిల్ రాజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని టాక్.  

click me!