రొమాంటిక్ టచ్.. లవర్స్ గా కట్టప్ప - శివగామి!

Published : Nov 13, 2018, 08:10 PM IST
రొమాంటిక్ టచ్.. లవర్స్ గా కట్టప్ప - శివగామి!

సారాంశం

భారతదేశంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన బాహుబలి చిత్రానికి సంబందించిన ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా అందులో నటించిన వారికి సంబందించిన న్యూస్ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రభాస్ - రానా - అనుష్క లకు ఆ సినిమా ద్వారా ఎంతగా క్రేజ్ వచ్చిందో అందరికి తెలిసిందే. 

అంతే స్థాయిలో కట్టప్ప - శివగామి గా కనిపించిన సత్యరాజ్ - రమ్య కృష్ణలకు కూడా క్రేజ్ పెరిగింది. అప్పట్లో ఒక యాడ్ లో కనిపించి షాక్ ఇచ్చిన ఈ జోడి ఇప్పుడు ఒక సినిమాలో రొమాంటిక్ టచ్ ఇవ్వనున్నారట. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన పార్టీ సినిమాలో రమ్య కృష్ణ - సత్యరాజ్ ప్రముఖ పాత్రల్లో నటించారు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే సినిమాలో వీరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందట. బాహుబలి సినిమాలో ఊహించని విధంగా కనిపించిన ఈ కాంబో ఇప్పుడు యంగ్ లవర్స్ గా కనిపించి షాక్ ఇవ్వనున్నారు. అయితే ఇది కేవలం సరదాగా జరిగే కామెడీ సన్నివేశాలే అంటున్నాడు దర్శకుడు. మరి ప్రేక్షకులు ఈ జోడీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?