
ఎన్టీఆర్ కు అత్తగా రమ్యకృష్ణ.. ఈన్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. గతంలో ఒకసారి ఎన్టీఆర్, రమ్యకృష్ణలు అత్త, అల్లుడుగా నటించారు. ఇప్పుడు ఈ మూవీలో రమ్యకృష్ణ అడుగుపెట్టడం వాళ్ళ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు.
రమ్య కృష్ణ గతంలో కూడా అత్త పాత్రలు చేసింది. నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ పవర్ పుల్ పాత్రలో కనిపించింది. ఇటు ఎన్టీఆర్ కు అత్తగా గతంలో రమ్యకృష్ణ కాకుండా.. నగ్మ కూడా నటించింది. అల్లరి రాముడు సినిమాలో గడసరి అత్తగా నటించిన నగ్మ పనిపట్టి.. ఆటకట్టిస్తాడు ఎన్టీఆర్. ఇలా అత్తా అల్లుడు కాన్సెప్ట్ కాస్తా.. మరోసారి రిపిట్ కాబోతున్నట్టు తెలస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈసినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో. ఈసినిమాలోనే రమ్యకృష్ణ చేత అత్త పాత్ర చేయిచాలి అని కొరటాల శివ అనుకున్నాడట. ఎన్టీఆర్ కూడా దానికి సై అనడంతో.. ఈమూవీలో తారక్ అత్తగా రమ్య కృష్ణ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
రమ్యకృష్ణ ఈ మధ్యన తన సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన పాత్రలు చేస్తోంది.. నటనలో.. పాత్రల్లో వైవిధ్యం కనిపించేలా జాగ్రత్తపడుతుంది. దాంతో ఆమెను అనేక పాత్రలు వరిస్తున్నాయి. ప్రేక్షకులను తన నటనతో మెస్మరైజ్ చేస్తోంది రమ్యకృష్ణ. సో ఎన్టీఆర్ కి అత్త అంటే హీరోయిన్ క్యారెక్టర్ పోషించే జాన్వీ కపూర్ కి తల్లి పాత్ర అయ్యి వుంటుంది. రమ్యకృష్ణ ఈసినిమాలో నటిస్తుంది లేనిది ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు మూవీ టీమ్. త్వరలో ప్రకటన ఉంటుందని అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని కొరటాల శివ తన కెరీర్ లోనే అత్యంత భారీ సినిమాను రూరొందిస్తున్నాడు. ఇక ఈసినిమాను యువ సుధ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ల పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ ని అందిస్తుండగా.. రత్నవేలు కెమెరా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.కొన్ని రోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన ఎన్టీఆర్ లుక్ ని రిలీజ్ చేస్తే.. ఆ లుక్ రికార్డు స్థాయిలో వ్యూస్ ని సొంతం చేసుకుంది. దేవర సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది.