
సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తాను టాయిలెట్స్ కూడా కడిగానని.. తన ఎక్స్ పీరియన్స్ ను శేర్ చేసుకున్నారు సల్మాన్. ఇంతకీ ఆయన ఆవ్యాఖ్యలు ఎందుకు చేశారు.
ఏజ్ బార్ అవుతున్నా.. కుర్ర హీరోలను మించిన హ్యాండ్సమ్ నెస్ తో.. అమ్మాయి హృదయాలను కొల్లగొడుతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్.. ఎన్నో వివాదాల్లో కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అటు సినిమాల చేస్తూనే.. ఇటు టెలివిజన్ షోలు కూడా చేసుకుంటూ.. దూసుకుపోతున్నాడు. సల్మాన్ ఖాన్ మొదటి నుంచి చేస్తున్న పాపులర్ షో.. బాలీవుడ్ బిగ్ బాస్. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కి గత కొన్నేళ్లుగా సల్మాన్ హోస్ట్ చేస్తున్నాడు.
ఈమధ్యే కొత్త గాస్టార్ట అయిన ఓటీటీ బిగ్‌బాస్ కి కూడా సల్మాన్ ఖానే హోస్ట్ గా చేస్తున్నారు. తాజాగా హిందీ ఓటీటీ బిగ్‌బాస్ షో పూర్తయింది. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ గా నిలిచాడు.అయితే ఫైనల్ ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్ ఫైనలిస్టుల్లో పూజ భట్ అనే కంటెస్టెంట్ ని అభినందిస్తూ హౌస్ నీలాగా క్లీన్ గా ఎవరూ ఉంచలేరు. టాయిలెట్స్ కూడా మొహమాటపడకుండా కడిగి క్లీన్ గా ఉంచావు. అని అప్రిషియేట్ చేశారు.
అంతే కాదు ఈసందర్భంగా ఆయన ఓ ఉదాహణకూడా చెప్పాడు. నేను కూడా అలాగే చేశాను. నేను చదువుకునేటప్పుడు బోర్డింగ్ స్కూల్ లో టాయిలెట్స్ క్లీన్ చేశాను. ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడు కూడా టాయిలెట్స్ క్లీన్ చేశాను. మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు. ఏ పని తక్కువ కాదు. అందుకు మనం బాధపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. సల్మాన్ ఖాన్ అతటివాడు టాయిలెట్స్ క్లీన్ చేయడం ఏంటీ అని.. ఆ విషయం సింపుల్ గా చెప్పేసిన సల్మాన్ ఖాన్ మంచితనం.. సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవు తున్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆయన గతంలో చాలా వివాదాస్పంద వ్యాఖ్యలు చేశారు. వాటితో సంచలనం సృష్టించాడు. కాని ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కొంత కాలం జైల్లో గడిపారు. ఇక ప్రస్తుతం ఉగ్రవాదుల లిస్ట్ లో కూడా ఉన్నారు సల్మాన్. ఈస్టార్ హీరోను చంపుతామంటూ.. పబ్లిక్ గానే వార్నింగ్ లు ఇస్తున్నారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.