రమ్యకృష్ణకు తలపొగరా..?

Published : Feb 06, 2019, 11:35 AM IST
రమ్యకృష్ణకు తలపొగరా..?

సారాంశం

ప్రముఖ సినీ నటి తలపొగరుతో ప్రవర్తిస్తుందా..? అంటే అవుననే అంటోంది 'దేవ్' సినిమా చిత్రబృందం. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో పొగరుగా కనిపించిన రమ్యకృష్ణ ఈసారి మరింతగా రెచ్చిపోనుందని అంటున్నారు. 

ప్రముఖ సినీ నటి తలపొగరుతో ప్రవర్తిస్తుందా..? అంటే అవుననే అంటోంది 'దేవ్' సినిమా చిత్రబృందం. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో పొగరుగా కనిపించిన రమ్యకృష్ణ ఈసారి మరింతగా రెచ్చిపోనుందని అంటున్నారు. కార్తి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

రకుల్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె సింగిల్ మదర్ గా కనిపించనుంది. భర్తకు దూరంగా ఉంటూనే కూతురిని కష్టపడి పెంచి, తన చుట్టూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న మహిళగా ఆమె పాత్రను డిజైన్ చేశారట దర్శకుడు.

ఈ సినిమా కోసం కార్తి బరువు తగ్గి సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ప్రకాష్ రాజ్.. హీరో తండ్రిగా నటించారు. సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్ సీన్లు ఆకట్టుకుంటాయని అంటున్నారు. హీరోకి అత్త పాత్రలు చేయడం రమ్యకృష్ణకి కొత్తేమీ కాదు.

మరి ఈ సినిమాలో ఆమె తలపొగరు అత్తగా ఎలా మెప్పిస్తుందో చూడాలి. రజత్ రవిశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది! 

PREV
click me!

Recommended Stories

Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?
Rachita Ram: బాడీ షేమింగ్ కామెంట్స్ పై కూలీ నటి స్ట్రాంగ్ రియాక్షన్, అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే