వర్మ గే... వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసిన జయకుమార్

First Published Jan 27, 2018, 12:57 PM IST
Highlights
  • జీఎస్టీ మూవీతో దర్శకుడు వర్మపై సంచలన ఆరోపణలు
  • వర్మలో మరో కోణం వుందంటున్న దర్శకుడు జయకుమార్
  • వర్మ బాలీవుడ్ హర్వీ విన్ స్టీన్ అంటున్న జయకుమార్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మియా మల్కోవాతో కలిసి చేసిన జీఎస్టీ చిత్రం అనంతరం ఎంత వివాదాస్పదమైందో చూస్తున్నాం. దీనిపై మహిళా సంఘాల ఆందోళనలు, కేసులు ఇలా అన్ని రకాల నిరసనలు ఓ వైపు వస్తున్నా, మరోవైపు ఆందోళనలు పట్టించుకోకుండా వర్మ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇప్పటికే అనూహ్య స్పందనతో ట్రాఫిక్ జామ్ కారణంగా రిలీజ్ కూడా వాయిదావేశారు. మొత్తానికి శనివారం రిలీజ్ చేసిన ఈ మూవీ వర్మను మాత్రం వదలటం లేదు.

 

గతంలో వర్మతో కలిసి పని చేసిన జయకుమార్ అనే రచయిత జీఎస్టీని కాపీ కొట్టారంటూ ఆరోపణలతో రచ్చకెక్కాడు. వాడో దొంగ అంటూ వర్మ తేల్చిపారేయడంతో జయకుమార్ నుంచి అనూహ్య ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్మలో చాలామందికి తెలియని మరో మనిషి ఉన్నాడని పెద్ద బాంబు పేల్చాడు.

 

రాంగోపాల్ వర్మలో మరో మనిషి ఉన్నాడని చెప్పిన జయకుమార్.. ఆయన్ను బాలీవుడ్ హార్వీ వీన్‌ స్టీన్‌‌గా అభివర్ణించాడు. హాలీవుడ్‌లో ఎంతమంది తారల జీవితాలతో ఆడుకున్న ప్రొడ్యూసర్ హార్వీ వీన్ స్టీన్‌తో వర్మను పోల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది.

 

వర్మ అసహజ శృంగారానికి పాల్పడే వ్యక్తి అని ఆరోపించిన జయకుమార్.. డబ్బు ఆఫర్ చేసి తనను చాలాసార్లు హోటల్ రూమ్స్‌ కు రమ్మన్నాడని, లైంగికంగా తనను వేధించాడని ఆరోపించాడు. వర్మ ఆపర్స్‌ ను తిరస్కరిస్తూ వస్తున్న కొద్ది తనపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించాడు.   

సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీలతో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించడం సహజమని, తాను కూడా అలాగే అనుకుని వర్మతో కలిసి పని చేశానని అన్నారు. కానీ ఆయనలో మరో మనిషి ఉన్నాడని జయకుమార్ విమర్శించారు. వర్మ లెక్కలు వేరుగా ఉంటాయని, సందర్భం వచ్చినప్పుడు ఆయన అసలు రంగు బయటపెడుతారని చెప్పుకొచ్చారు.

రాంగోపాల్ వర్మ 'హోమో సెక్సువల్' అని తాను చెప్పడం లేదని, కానీ వర్మ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతానని జయకుమార్ పేర్కొనడం గమనార్హం. వర్మ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని, వర్మ బాధితులంతా ముందుకు వచ్చి #meetoovarma క్యాంపెయిన్ లో భాగమవ్వాలని జయకుమార్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు

 

జయకుమార్ ఆరోపణల్లో నిజమెంతనేది తెలియదు కానీ రోజురోజుకు ఈ వివాదం మరింత దిగజారుతున్నట్లే కనిపిస్తోంది. జయకుమార్ చేసిన తాజా ఆరోపణలకు వర్మ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. వర్మ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అతను పోరాటం చేస్తానని చెప్పడం మాత్రం పెద్ద దుమారమే లేపేలా ఉంది. వర్మ తన కథ కాపీ కొట్టాడని జయకుమార్ ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 

ఇదిలావుంటే.. వర్మ సైతం జయకుమార్ పై పలు ఆరోపణలు చేశాడు. తన సంస్థలో అతను చాలాసార్లు దొంగతనానికి పాల్పడ్డాడని, ఆఖరికి జీఎస్‌టీ కథను కూడా తమ కంప్యూటర్ నుంచి హ్యాక్ చేసి ఉంటాడని ఆరోపిస్తూ.. సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపాడు.

 

జయకుమార్ సంగతి అలా ఉంచితే.. మహిళ సంఘాలు, ఫెమినిస్టులు వర్మపై ఆందోళనలు, ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే వర్మ మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 'జీఎస్‌టీ' నేడే విడులైంది కాబట్టి.. దీనిపై వచ్చే స్పందనను బట్టి వర్మపై మరిన్ని ఫిర్యాదులు, ఆందోళనలు వెల్లువెత్తవచ్చు.

click me!