మంత్రి సోమిరెడ్డిని ఎడాపెడా వాయించేసిన రామ్ గోపాల్ వర్మ

Published : Oct 12, 2017, 10:44 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
మంత్రి సోమిరెడ్డిని ఎడాపెడా వాయించేసిన రామ్ గోపాల్ వర్మ

సారాంశం

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మంత్రి సోమిరెడ్డి కమెంట్స్ సోమిరెడ్డి కమెంట్స్ పై తీవ్రంగా స్పందించిన వర్మ తనతో సోమిరెడ్డి చర్చకు రావాలని సవాల్  

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వర్మను విమర్శిస్తూ ఆంధ్ర ప్రదేశ్ మంతత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. మహిళల పట్ల, హిరోయిన్ల పట్ల చులకనభావం మంత్రిగారికి తగదన్నారు వర్మ. అసలు సోమిరెడ్డిని హీరోగా పెడదామంటే... హిరోయిన్లు ఎవరూ మేం చేయమని చెప్తున్నారు. వాళఅలు చెప్తున్న కారణాలకు నేను షాకయ్యా. కాకపోతే ఆ విషయాలు బయటపెట్టి సోమిరెడ్డి భార్యను కించపరడటం నాకిష్టం లేదంటూ వర్మ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ఉద్దేశం లేకుండానే ఇన్నాళ్లుగా రాజకీయాల్లో వున్నారా అని వర్మ ప్రశ్నించారు. అంతేకాక తన సినిమాపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు వర్మ.

My replies to the great honourable TDP agriculture minister మర్యాద తిమ్మన్న సోమిరెడ్డి గారి comments

మినిస్టర్ సోమి : 
NTR జీవిత చరిత్ర సినిమాలో నన్ను హీరో గా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం
నేను హీరోగా చేయాలంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతిని మార్చాలి

RGV: 
సార్ మీరు హీరోయిన్ గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పాడుకొనే నుండి మీ అగ్రికల్చర్ పొలాలలో పని చేసే స్త్రీ కూలీలదాకా అందర్నీ అడిగి చూసా. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా

మినిస్టర్ సోమి :
లక్ష్మి పార్వతి గారంటే నాకు చాలా గౌరవం ఉంది . అందుకే ఆమె హీరోయిన్ గా వద్దు అంటున్నా..

RGV: 
అంటే హీరోయిన్లు గౌరవానికి అనర్హులనా? మినిస్టర్ గారూ, హీరోయిన్లపై మీ ఈ insulting కామెంట్ పైన దీపికా పదుకొనె, సమంత, కత్రినా కైఫ్, ఇలియానా, ప్రియాంక చోప్రా వగైరా హీరోయిన్ల రియాక్షన్లు మీడియా వెంటనే తీసుకోకపోతే వాళ్ళు కూడా మీ అంత అతి&@“?:(@@వాళ్ళు ..నేను దీని అర్థం చెప్పను. ఎందుకులే ఎంత చెడ్డా మీరు మినిస్టర్ గా!!!

మినిస్టర్ సోమి :
ఎన్ టి ఆర్ గురించి నాకు తెలిసినంతగా రాంగోపాల్ వర్మకు తెలియదు

RGV: 
మై డియర్ సోమి ,ఇక్కడ ప్రశ్న నాకెంత తెలుసని కాదు. తెలిసేంత బుర్ర నీకు ఉందా అని ?

మినిస్టర్ సోమి :
రాజకీయ ఉద్దేశాలతోనే ఈ సినిమాను ఎన్నికల ముందు తీస్తున్నారు

RGV:
సోమి ,రాజకీయ ఉద్దేశాలు ఏమి లేకుండానే రాజకీయ నాయకుడివి అయ్యావా .....ఆలా అయితే nee N కి నా నమస్కారం. N ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ..N అంటే nee నోరు

మినిస్టర్ సోమి: political reasons కోసమే ఈ సినిమాకు వైసీపీ నేత నిర్మాతగా వున్నారు

RGV: ఛా! మా నాయనే... నీ ఇల్లు బంగారం గాను... చిన్నప్పటి నుండి ఇన్ని తెలివితేటలా సార్.. 

మినిస్టర్ సోమి :
ఎన్ టి ఆర్ చరిత్రను వక్రీకరించి కేవలం లక్ష్మీ పార్వతి కోణంలోనే సినిమా తీస్తే ప్రజలు ఒప్పుకోరు..

RGV:
ఓహ్ సార్ ఈ మాట కోట్ల ప్రజలు ట్రైన్లలో, బస్సుల్లో మీ ఇంటికొచ్చి మీ చెవిలో చెప్పారా సార్ ..Soooo wonderfulll😍😍Want to sooooo kiss u 😘😘😘

మినిస్టర్ సోమి :
రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా గురించి మేము భయపడటం లేదు

RGV: భయపడనప్పుడు ఇంత అరవాల్సిన అవసరం ఏముంది రెడ్డి గారు ? Just asking? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఉందంటారా సార్ ?

మినిస్టర్ సోమి :
రాజకీయ ప్రయోజనాలు లేకుండా వాస్తవమ్ తీయమని అంటున్నా...

RGV: అబ్బబ్బో మీకు నాకన్నా ఎక్కువ వాస్తవాలు తెలుసని మీరు అంటుంటే ఆ రోజుల్లో తలుపెనక నక్కి ఉండేవారా లేక మంచం కింద దాక్కునేవారా? ...రెడ్డిగారు చెప్పండి ప్లీజ్ ..మేము మీ గాసిప్ కోసం తహతహలాడిపోతున్నాము.

చివరగా నాకన్నా ఎక్కువ NTR గారి గురించి తెలుసన్న సోమిరెడ్డి గారికి నా open challenge ఏమిటంటే TV9 లో Open Debate కి రమ్మని ..సోమిరెడ్డి గారు మీరు ఫ్రీ ఉన్నపుడు ముంబైలో నా అన్ని పనులు మానుకొని debate కి వస్తా ..టైము ప్లేసు మీరే చెప్పండి సార్

PREV
click me!

Recommended Stories

Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?