
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వంగవీటి రేపు విడుదల కాబోతోంది. వంగవీటి రంగా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ సంగతి అటుంచితే... మెగా ఫ్యాన్స్ ను అవకాశం దొరికినప్పుడల్లా ఏదో విధంగా రెచ్చగొట్చే వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గురించి వర్మ ఏమన్నాడో చూడండి.
పవన్ కళ్యాణ్ గురించి ప్రతి విషయంలోనూ ఎంటరైపోతుంటాడు వర్మ. పవన్ సినిమాలు, రాజకీయాల గురించి ట్విట్టర్లో తన అభిప్రాయాలను తెలిపే వర్మ తాజాగా జరిగిన ‘వంగవీటి’ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కొన్ని సంచలనం వ్యాఖ్యలు చేశాడు.
‘పవన్ కళ్యాణ్ ఒక స్టార్ గా నాకు చాలా ఇష్టం కానీ పవనిజం లాంటివే గందరగోళంగా అనిపిస్తాయి. పవన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయనతో నిద్రపోతున్న అగ్నిపర్వతం. అప్పుడప్పుడు గుడ గూడలాడుతూ పొగలొదులుతూ ఉంటాడు. టైమ్ వచ్చినప్పుడు బద్దలవుతాడు’ అన్నారు. అలాగే భవిష్యత్తులో పవన్ ప్రభావం తెలుగు రాజకీయాల మీద తప్పకుండా ఉంటుందని, కేవలం ఆయనొక్కడే రాజకీయాల్ని ఎంతో సహనంతో గమనిస్తున్నాడని, ఖచ్చితంగా ఎదో ఒకరోజు ఆయన తన నిజమైన పవర్ చూపిస్తాడని కామెంట్ చేశారు