అదే బాలయ్యతో చెప్పా..గొడవేమీ లేదు:వర్మ

Published : Mar 23, 2019, 09:31 AM IST
అదే బాలయ్యతో చెప్పా..గొడవేమీ లేదు:వర్మ

సారాంశం

 ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా ఆయన అగస్త్య మంజుతో కలిసి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను తెరకెక్కించారు. ఆ చిత్రం  ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏదో పగ పట్టినట్లుగా తనకు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీసే ఛాన్స్ ఇవ్వలేదని ఈ సినిమా తీస్తున్నారని మీడియాలో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి.  

బాలకృష్ణతో ఎన్టీఆర్‌ బయోపిక్‌ చేసే  అవకాశం మీకే వచ్చుంటే, అప్పుడు  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో ఉన్న కంటెంట్ ని  తెరపై చూపించకపోదురని అంటున్నారు. ఈ విషయమై మీడియా వారు డైరక్టర్ గా రామ్ గోపాల్ వర్మనే ప్రశ్నించారు. దానికి వర్మ చాలా సూటిగా సమాధానమిచ్చారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తున్నప్పుడు   ఈ అంశం లేకపోతే... అందులో    భావోద్వేగాలు, సంఘర్షణ అంటూ ఏమీ ఉండవు. అందుకే అది ఉంటేనే సినిమా చేస్తానని బాలకృష్ణతో చెప్పా. ఆయన స్ట్రెయిట్‌ లైన్‌లో సినిమా చేస్తేనే బాగుంటుందన్నారు. అంతే తప్ప మా మధ్య గొడవేమీ లేదు' అన్నారు.

అంతేకాదు.... ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి బాలకృష్ణ నన్ను కలిశాక అప్పుడు నా దృష్టికి వచ్చిన సంఘటనలనే తెరకెక్కించాను. ఆయన పరిచయం చేసిన కొద్దిమంది వ్యక్తులతో ఈ సమాచారం సేకరించాక, అక్కడ్నుంచి మరింత లోతుగా వెళ్లిపోయింది అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?