
రామ్ చరణ్ టీమ్ కు డైరక్టర్ సుకుమార్ కు అంతగా సెట్ కావడం లేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయమై సుకుమార్ నేరుగా రామ్ చరణ్ తో డిస్కస్ చేసి, కొన్ని విషయాలు ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ ఇటీవల టూర్లలో ఫుల్ బిజీగా వున్నారు.
దుబాయ్, ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఇప్పుడు యుఎస్ బయల్దేరుతున్నారు. అక్కడి నుంచి వచ్చాక కానీ సుకుమార్-రామ్ చరణ్ మీట్ సాధ్యం కాకపోవచ్చు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఆర్ట్ డైరక్టర్ తరణి తదితర విషయాల్లో కొంత డిస్కషన్ జరగాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.