స్క్రిప్టు సెట్ అవ్వలా, హోల్డ్ లో రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్టు

Published : Feb 16, 2023, 12:10 PM IST
స్క్రిప్టు సెట్ అవ్వలా,   హోల్డ్ లో రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్టు

సారాంశం

 అదే సమయంలో ఫైనల్ స్క్రిప్టు నేరేషన్ లో రామ్ చరణ్ ని, ఆయన టీమ్  ఇంప్రెస్ చేయటంలో  డైరక్టర్ ఫెయిల్ అయ్యారని  అందుకే ఆ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టారని తాజా సమాచారం. 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.  ఆ క్రమంలోనే  కన్నడలోని ప్రముఖ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ ఒక సినిమా కమిటైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. "మఫ్టీ" అనే  హిట్ సినిమాతో  క్రేజ్  సంపాదించిన డైరెక్టర్ నర్తన్. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ట్రేడ్ అంటోంది. అయితే అదే సమయంలో ఫైనల్ స్క్రిప్టు నేరేషన్ లో రామ్ చరణ్ ని, ఆయన టీమ్  ఇంప్రెస్ చేయటంలో  డైరక్టర్ ఫెయిల్ అయ్యారని  అందుకే ఆ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టారని తాజా సమాచారం. ఈ లోగా స్క్రిప్టు కరెక్షన్స్ చేసుకుని మరో నేరేషన్ వినే అవకాసం ఉంది. అన్నీ ఓకే అనుకుంటే యూవి క్రియేషన్స్ వారు ఈ ప్రాజెక్టు ని భారీగా నిర్మిస్తారు. 

"ఆర్ఆర్ఆర్" సినిమాతో రామ్ చరణ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్ లో ఓకే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తను ఓకే చేసే సబ్జెక్టులు ప్యాన్ ఇండియా స్దాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.  ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ లో #ఆర్సి15 అనే ప్యాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. 

స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే రామ్ చరణ్ నర్తన్ దర్శకత్వంలో సినిమాని మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.  వాస్తవానికి "జెర్సీ" ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ ఒక సినిమాని చేయాల్సింది కానీ ఈ మధ్యనే రామ్ చరణ్ ఆ సినిమాని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌