జ్యోతిక పై కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అంత సీన్ లేదంటున్న బాలీవుడ్ నటి

Published : Feb 16, 2023, 11:59 AM IST
జ్యోతిక పై కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అంత సీన్ లేదంటున్న బాలీవుడ్ నటి

సారాంశం

బాలీవుడ్ లోవివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఆమెకునచ్చకపోయినా.. ఎదురెళ్లినా.. ఎంతటివారినైనా వదిలిపెట్టదు కంగనా. ఇక ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ లా మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు టాలెంట్ ను మెచ్చుకుంటూ.. ఆకాశానికి ఎత్తుతుంటుంది రనౌత్. ఈక్రమంలో ఆమె హీరోయిన్ జ్యోతిక పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

వరుస సినిమాలతో జోరుమీద ఉంది కంగనా రనౌత్. బాలీవుడ్ తో పాటు ..సౌత్ సినిమాలపై కూడా గట్టిగా దృష్టి పెట్టింది సీనియర్ బ్యూటీ. ముఖ్యంగా తమిళ సినిమాలో.. ఎక్కువగా నటిస్తోంది. తెలుగులో ఏక్ నిరంజం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కంగనా.. బాలీవుడ్ చేరి.. అక్కడ టాప్ పోజిషన్ కు చేరింది. ఇక రీసెంట్ గా తమిళంలో చంద్రముఖీ సీక్వెల్ సినిమాలో నటిస్తోంది కంగనా. ఈమూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2005 లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు సబంధించిన విశేషాలను మీడియాతో పంచుకుంది కంగనా రనౌత్. ఈసందర్బంగా చంద్రముఖి ఫస్ట్ మూవీలో నటించిన జ్యోతికాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది కంగనా. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రముఖి సినిమాలో నటి జ్యోతిక  నటన సాటిలేదని ఆమెకు ధీటుగా నటించడం తనకే కాదు ఇంకెవరికీ  సాధ్యం కాదని కంగన స్పష్టం చేసింది. చంద్రముఖిగా జ్యోతిక అద్భుతంగా నటించారని, ఆ స్థాయికి తన నటన ఉండదని తెలిపింది.ఇక చంద్రముఖి సినిమాను డైరెక్ట్ చేసిన  సీనియర్‌ దర్శకుడు పి.వాసు చంద్రముఖీ 2ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ మూవీలో ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌తో పాటు కంగనా రనౌత్‌, వడివేలు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

అయితే చంద్రముఖి2 లో కూడా లీడ్ క్యారెక్టర్ అయిన చంద్రముఖిగా నటించేందుకు జ్యోతిక నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో  ఆమె స్థానంలో కంగనాను తీసుకున్నారట మేకర్స్.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇక ఈమూవీలో సాంగ్స్ షూటింగ్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టింది కంగనా.. ప్రముఖ కొరియోగ్రాఫర్  కళా మాస్టర్‌తో కలిసి కంగనా డ్యాన్స్‌ రిహార్సల్‌ చేస్తున్నారు. ఇటు సౌత్ .. అటు బాలీవుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. కెరీర్ లో  టాప్ గేర్‌లో వెళుతున్నారు కంగనా రనౌత్. ఈ రెండు మాత్రమే కాకుండా.. ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తూ దూసుకుపోతోంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ.. టాప్ హీరోయిన్‌గా సాగుతోంది. 

తమిళంలో కంగనాకు ఇదిరెండో సినిమా గతంలో ఈబ్యూటీ తమిళంలో తలైవి సినిమాలో నటించి మెప్పించింది.  తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోగ్రఫీ  ఆధారంగా ఈ సినిమా తెరకెక్కి..పాన్ ఇండియా స్థాయిలో  సూపర్ సక్సెస్ సాధించింది. ఇక నార్త్ లో మరో సినిమా చేస్తోంది కంగనా. భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధి పాత్రలోనటించడంతోపాటు.. ఆ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తోంది కంగనా. ఇటు సినిమాలు చేస్తూనే.. అటు పాలిటిక్స్ లో కూడా అప్పుడప్పుడు తొంగి చూస్తోంది బ్యూటీ. ట్వీట్లూ.. కౌంటర్లతో నెట్టింట తెగ హడావిడిచస్తుంటుంది. 
 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ