అఫీషియల్ : చరణ్ ఓకే చేసిన ఆరు సినిమాలు...ఆ డైరక్టర్స్ లిస్ట్

Published : Jan 16, 2023, 11:57 AM IST
 అఫీషియల్ : చరణ్ ఓకే చేసిన ఆరు సినిమాలు...ఆ డైరక్టర్స్ లిస్ట్

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడి.. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. 

ఆర్.ఆర్.ఆర్ ..ఆస్కార్ ఎంట్రీతో మంచి జోష్ మీద ఉన్నారు రామ్ చరణ్. ఆయన తన తాజా చిత్రాలను ఆచి..తూచి ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరు సినిమాలు సైన్ చేసానని అన్నారు. వాటిలో కొన్ని ప్రపోజల్ స్టేజీలో ఉన్నాయని,మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో, కొన్ని  షూటింగ్ స్టేజీలో ఉన్నాయని విదేశీ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. 

రామ్ చరణ్ చేస్తున్న లేదా చేయబోతున్న  డైరక్టర్స్ :
 #RC15, శంకర్ దర్శకత్వంలో షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది.
 #RC16, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనాతో ప్రస్తుతం కథ ఓకే అయ్యింది
  #RC17 or #RC18 దర్శకుడు సుకుమార్ తో ...ఈ చిత్రం ఉంటుంది
 #RC17 or #RC18 కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఈ చిత్రం ఉంటుంది
 #RC19 ఖైదీ, విక్రమ్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ..ఈ చిత్రం ఉంటుంది
#RC20 మప్టీ వంటి సూపర్ హిట్ ఇచ్చిన  కన్నడ దర్శకుడు #narthan తో ఈ చిత్రం ఉంటుంది.


"ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు.  ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. #ఆర్సీ15 గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా.
 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ