
మహేష్ బాబు , కీర్తి సురేష్ కాంబినేషన్ మూవీ సర్కారువారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చివరిగా మాట్లాడిన సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ఎమోషనల్ అయ్యాడు. ఒక రకంగా మహేష్ కళ్ళు చెమ్మగిల్లాయి.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ నిండిపోయింది. సర్కారువారి పాట ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. . ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు కీర్తి సురేష్, పరశురామ్, వీరితో పాటు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, వంశీ పైడి పల్లి కూడా సందడి చేశారు.
తక్కువ మాట్లాడినా.. చాలా ఇంపార్టెంట్ విషయాలను మాట్లాడారు మహేష్ బాబు. ఈరెండేళ్లలో తనకు చాలా దగ్గరైన వాళు దూరమయ్యారంటూ.. అన్న రమేష్ బాబును తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. ఒక దశలో ఆయన కళ్లల్లో నీళ్ళు కూడా తిరిగాయి. అయినా నేను ముందుకు వెళ్లడానికి మీ ప్రోత్సాహం చాలు అంటూ.. అభిమానుల సపోర్ట్ ను కోరుకున్నారు మహేష్. ఈ నెల
12న ఘన విజయాన్ని చూడబోతున్నాం అన్నారు.
మనమంతా ఇలాంటి కార్యక్రమం చేసుకుని రెండేండ్లవుతున్నది. డైరెక్టర్ పరశురామ్ ఒక్కడు సినిమా చూసి దర్శకుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు. కాని ఈరోజు ఆయన నాకు, నా అభిమానులకు ఫేవరేట్ డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన నన్ను కొత్తగా చూపించారు. అంటూ డైరెక్టర్ పరశురామ్ గురించి చెప్పుకొచ్చారు మహేష్.
ఇక ఈసినిమాలో నా ఫేవరేట్ క్యారెక్టర్ ఇది. మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతిదీ వెరైటీగా డిజైన్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో నటిస్తుంటే పోకిరీ రోజులు గుర్తొచ్చాయి. ట్రైలర్ చూశాక మీరంతా ఎంత ఎంజాయ్ చేశారో, నేనూ అంతే ఆస్వాదించాను. చాలా హైలైట్స్ ఉంటాయి. హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ అందులో ఒకటి. ఈ సీన్స్ కోసమే రేపు రిపిట్ ఆడియన్స్ ఉంటారు అన్నారు కీర్తి సురేష్.
కీర్తి సురేష్ పాత్ర సరదాగా సాగుతుంది. థమన్ మ్యూజిక్ సెన్సేషన్. మా మధ్య అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆయన బ్యాక్ గ్రౌ్‌ండ స్కోర్ చాలా బాగుంటుంది అన్నారు. కళావతి పాట గురించి నేను డౌట్ పడితే.. తమన్ నమ్మకం ఇచ్చాడు. అనుకున్నట్టుగానే ఈ పాటతో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడన్నారు మహేష్. ఈ నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. మళ్ళీ మళ్ళీ మనం సినిమా చేయాలి సర్ అంటూ నిర్మాతల గురించి మాట్లాడారు మహేష్.
ఇక మే 12న రిలీజ్ కాబోతున్న ఈసినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్, 14 రీల్స్ తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సర్కారువారి పాట సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళావతి పాట అంతటా..మారు మోగిపోతోంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది టీమ్.
ఒక్కో డైలాగ్ గట్టిగా పేలడంతో సూపర్ స్టార్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మూవీ టీమ్ కూడా ప్రమోషన్ ఈవెంట్స్ ను గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రమోషన్స్ లో హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. ఇక నుంచి సూపర్ స్టార్ కూడా వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.