`పోండి సార్ మీతో కటీఫ్.. మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు`

By Satish ReddyFirst Published Jun 28, 2020, 4:32 PM IST
Highlights

ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా వర్మ తీరుపై స్పందించాడు. `ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని  చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం...మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్` అంటూ ఆర్జీవీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు రామజోగయ్య.

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు దేశ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తొలి సినిమా శివతోనే తెలుగు సినిమాను మలుపు తిప్పిన రామ్ గోపాల్ వర్మ తరువాత జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాడు. ఒకప్పుడు దేశంలోనే నెంబర్‌ వన్‌ డైరెక్టర్‌ అనే స్థాయికి చేరిన రామ్‌ గోపాల్‌ వర్మ కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా నాలుగైదు సంవత్సరాలుగా వర్మ చేస్తున్న సినిమాలను ఆయన ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీశాయి.

ముఖ్యంగా లాక్‌ డౌన్‌ సమయంలో వర్మ తెరకెక్కించిన సినిమాలతో ఆయన ఇమేజ్ మరింతగా మసకబారింది. దీంతో ఆయన అభిమానులలు కూడా వర్మ తీరుపై పెదవి విరుస్తున్నారు, ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా వర్మ మీద దారుణమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో వర్మ మాత్రం అంతా నా ఇష్టం అన్నట్టుగా తన పని తాను చేసుకుపోతున్నాడు. వరుసగా బిగ్రేడ్ సినిమాలను ప్రేక్షకుల మీదకు వదులుతున్నాడు.

తాజాగా ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా వర్మ తీరుపై స్పందించాడు. `ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని  చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం...మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్....మీరేమీ  రిప్లై ఇవ్వక్కర్లేదు..తెలివిగా ఎదో చెప్పేస్తారు...నేను హర్ట్` అంటూ ఆర్జీవీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు రామజోగయ్య.

ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం...మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్....మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు..తెలివిగా ఎదో చెప్పేస్తారు...నేను హర్ట్ :(

— RamajogaiahSastry (@ramjowrites)

లాక్‌ డౌన్‌ సమయంలో క్లైమాక్స్‌ పేరుతో సెమీ పోర్న్‌ సినిమాను రిలీజ్‌ చేసిన వర్మ, శనివారం నేక్డ్‌ అనే బీ గ్రేడ్‌ సినిమాను ప్రేక్షకుల మీదకు వదిలాడు. తాజాగా పవర్‌ స్టార్‌ పేరుతో పవన్ కళ్యాణ్‌ మీద ఓ సెటైరికల్‌ సినిమాను ఎనౌన్స్ చేశాడు. దీంతో వర్మ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

click me!