రాజమౌళితో సినిమా నా డ్రీమ్‌.. `సర్కారు వారి పాట` మరో `పోకిరి`.. మహేష్‌ కామెంట్స్

Published : Sep 25, 2021, 08:30 AM IST
రాజమౌళితో సినిమా నా డ్రీమ్‌.. `సర్కారు వారి పాట` మరో `పోకిరి`.. మహేష్‌ కామెంట్స్

సారాంశం

రాజమౌళి(rajamouli) సినిమాపై మహేష్‌బాబు(maheshbabu) స్పందిస్తూ త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్‌ రాబోతుందన్నారు. కథపై చర్చించబోతున్నామని, రాజమౌళితో చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. అది అందరికి తెలిసిందే. నాకిది ఒక కల నెరవేరిన ఫీలింగ్‌ అని చెప్పారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ ప్రస్తుతం `గీతగోవిందం` ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. బ్యాంక్‌ వ్యవస్థలోని కుంభకోణాలు ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మహేష్‌ `బిగ్‌సి` సెల్‌ఫోన్స్ సంస్థకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇందులో భాగంగా  శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్‌ ఆపిల్‌ ఫోన్‌ ఫ్యాన్ అని, ఏ కొత్త ప్రొడక్ట్ లాంచ్‌ అయినా కొంటానని తెలిపారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయడానికి తన ఇమేజ్‌కి తగ్గట్టుగా, తన స్టయిల్‌కి తగ్గట్టుగా ఉండాలన్నారు.

పూరీ శిష్యుడు పరశురామ్‌ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా `పోకిరి` లాగా సినిమా ఉండబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. మీరేమంటారనే ప్రశ్నకి మహేష్‌ స్పందిస్తూ, ఆ వార్త నిజమే అని, ఇది కచ్చితంగా `పోకిరి` తరహాలో ఉండబోతుందని తెలిపారు. పరశురామ్‌ నెరేట్‌ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఎగ్జైటెడ్‌గా అనిపించింది. దీంతో ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశాను. కచ్చితంగా ఇది తన కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది అని మహేష్‌ చెప్పారు. 

`దూకుడు` పదేళ్లు పూర్తి చేసుకోవడం గురించి చెబుతూ, నాన్నగారి అభిమానులు, నా అభిమానులు ప్రతి క్షణం మమ్మల్నిసపోర్ట్ చేస్తున్నారు. పదేళ్ల తర్వాత విడుదలైన నా సినిమా `దూకుడు` 26 సెంటర్లలో రిలీజ్‌ అయితే 23 సెంటర్లు హౌజ్‌ఫుల్‌ కావడం, ఓ ఫెస్టివల్‌ వాతావరణం థియేటర్లలో నెలకొనడం చాలా ఆనందంగా ఉంది. అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాను` అన్నారు. 

రాజమౌళి సినిమాపై స్పందిస్తూ త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్‌ రాబోతుందన్నారు. కథపై చర్చించబోతున్నామని, రాజమౌళితో చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. అది అందరికి తెలిసిందే. నాకిది ఒక కల నెరవేరిన ఫీలింగ్‌ అని చెప్పారు. మీకు నచ్చి సినిమా `అల్లూరి సీతారామరాజు` అని చెప్పారు. ఎనర్జీ సీక్రెట్‌ చెబుతూ అన్ని వేళలా హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. స్ట్రెస్ తీసుకోనని చెప్పారు. సింపుల్‌గా ఉంటానన్నారు. 

ఫోన్‌తో అందరు మీతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు. కానీ మీరు ఎవరితో సెల్ఫీ తీసుకుంటారని అడిగిన ప్రశ్నకి, తాను తన నాన్న కృష్ణగారితో సెల్ఫీ తీసుకుంటానని చెప్పారు. త్రివిక్రమ్‌ సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌