స్నేహమే రామారావు ఆన్ డ్యూటీకి పునాది పడేలా చేసింది: డైరెక్టర్ శరత్ మండవ

Published : Jul 26, 2022, 08:03 PM IST
స్నేహమే రామారావు ఆన్ డ్యూటీకి పునాది పడేలా చేసింది:  డైరెక్టర్ శరత్  మండవ

సారాంశం

ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ.. డైరెక్టర్ గా మారారు శరత్ మండవ. రవితేజతో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ఈ వారం రిలీజ్ కు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెండ్స్ చేశారు. 

రవితేజ  హీరోగా, దివ్యాంశ కౌషిక్, హీరో హీరోయిన్లు గా.. వేణు తొట్టెంపూడి ఇంపార్టెంట్ రోల్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ.  శరత్ మండవా తన ఎఫెట్ అంతా పెట్టి.. ఈ సినిమాను  రూపొందించాడు. ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది.  సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 29న శుక్రవారం రిలీజ్ కాబోతోంది. 

శరత్ మండవ మొట్ట మొదటి సారి  ఈ సినిమాతోనే దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. అయితే  డైరెక్టర్ గా కాకపోయినా.. శరత్ మండగా మొదటి నుంచీ.. ఇండస్ట్రీలో వివిధ విభాగాలలో పనిచేశాడు. ఎన్నో కష్టాలు పడి తను అనుకున్ డైరెక్టర్ స్థానానికి వచచాడు. ఈ విషయాలు స్వయంగా శరత్ వెల్లడించారు.  

సినిమాల పట్ల ప్యాషన్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి పెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి వైపు వచ్చాడు శరత్ మండవ.  కమల్  ప్రొడక్షన్ హౌస్ లో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు.  ప్రభాస్ బిల్లా 2  వంటి సినిమాలకు కథ .. స్క్రీన్ ప్లే అందించాడు. తమిళంలో ఆ మధ్య వచ్చిన 'కో 2' సినిమాకి దర్శకత్వం వహించాడు. అంతే కాదు  సినిమాటోగ్రాఫర్ గా కూడా  పని చేసిన అనుభవం ఉంది శరత్ మండవకు. 

ఇక ఇండస్ట్రీకి రాకముందే నిర్మాత  సుధాకర్ చెరుకూరితో శరత్ కి మంచి స్నేహం ఉందట. ఆ స్నేహమే ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ  సినిమా చేయడానికి పునాది పడేలా చేసిందన్నారు శరత్. . రచయితగా, కెమెరామెన్ గా , దర్శకుడిగా ఉన్న అనుభవం నిర్మాతలో పాటు అందరికి తనపై ఉన్న నమ్మకాన్ని పెంచింది. అంతే కాదు సినిమా సక్సెస్ విషయంలో కూడా అదే నమ్మకంతో ఉన్నారు శరత్. రవితేజతో పని చేయడం తనకు ఉత్సాహాన్నిచ్చిందన్నారు.  

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: నా సినిమాని పాడు చేయొద్దు, చిరంజీవికి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్.. కట్ చేస్తే
Anasuya: నో మేకప్‌ లుక్‌లో అనసూయ.. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే?