రామ్ కోసం పూరి మాస్ మసాలా స్క్రిప్ట్ రెడీ?

By Prashanth MFirst Published 18, Nov 2018, 5:24 PM IST
Highlights

టాలీవుడ్ లో అగ్రదర్శకుల లిస్ట్ తీస్తే అందులో పూరిజగన్నాథ్ పేరు ఎప్పటికైనా చెప్పాల్సిందే. ఇప్పుడున్న దర్శకుల్లో వేగంగా సినిమాలు చేయగల దర్శకుల్లో పూరి మొదటి స్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు. 

టాలీవుడ్ లో అగ్రదర్శకుల లిస్ట్ తీస్తే అందులో పూరిజగన్నాథ్ పేరు ఎప్పటికైనా ఉంటుంది. ఇప్పుడున్న దర్శకుల్లో వేగంగా సినిమాలు చేయగల దర్శకుల్లో పూరి మొదటి స్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు. తనదైన శైలిలో డైలాగ్స్ తో స్క్రీన్ ప్లే తో ఒక ఆటాడుకునే ఈ దర్శకుడు గత కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. 

మెహబూబా తరువాత ఎవరితో సినిమా చేస్తున్నాడనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే రామ్ మొన్న హలో గురు ప్రేమ కోసం రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ లో భాగంగా పూరితో చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. ఇంకా కథను ఫైనల్ చేయలేదని పూర్తిగా స్క్రిప్ట్ విన్నాకే ఫైనల్ గా సెట్స్ పైకి సినిమాను తీసుకెళతా అనే విధంగా రామ్ సమాధానం ఇచ్చాడు.  

అయితే పూరి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం రామ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మంచి మాస్ మసాలా కథలో మళ్ళి పూరి గతంలో రాసిన డైలాగ్స్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ గా రామ్ తో పలికిస్తాడని తెలుస్తోంది. ఇంకా కొన్ని డైలాగ్స్ కోసం పూరి హోమ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారంకు. అది కాస్త అయిపోతే ఫిబ్రవరి నెలలోనే ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Last Updated 18, Nov 2018, 5:24 PM IST