పాపకు జన్మనిచ్చిన అప్పటి స్టార్ హీరోయిన్!

By Prashanth MFirst Published 18, Nov 2018, 4:59 PM IST
Highlights

బాలీవుడ్ లో హీరోయిన్ గానే కాకుండా మంచి హోస్ట్ గా కూడా తనకంటూ ఓక్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నేహా ధూపియా. ఈ ఏడాది మే నెలలో అమ్మడి పెళ్లి వివాహం ఏ విధంగా వైరల్ అయ్యిందో స్పెషల్ గా చప్పనవసరం లేదు. 

బాలీవుడ్ లో హీరోయిన్ గానే కాకుండా మంచి హోస్ట్ గా కూడా తనకంటూ ఓక్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నేహా ధూపియా. ఈ ఏడాది మే నెలలో అమ్మడి పెళ్లి వివాహం ఏ విధంగా వైరల్ అయ్యిందో స్పెషల్ గా చప్పనవసరం లేదు. గత కొంత కాలంగా తన బాయ్ ఫ్రెండ్ అంగద్ బేడీ తో డేటింగ్ లో ఉన్న నేహా స్పీడ్ గా పెళ్లి చేసేసుకుంది. 

అయితే ప్రెగ్నెస్నీ రావడంతోనే అమ్మడు పెళ్లి చేసుకుందని అప్పట్లో రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఆగస్ట్ లోనే తను ప్రెగ్నెంట్ అని బహిర్గతం చేసిన నేహా నేడు ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ ఆమె సన్నిహితులు అధికారికంగా మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. 

నేహా ధూపియా అలాగే జన్మించిన చిన్నారి ఇద్దరు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని చెప్పడంతో నెటిజన్స్ వారికి విషెస్ అందించారు. పెళ్లి పై ఎలాంటి టాక్ వచ్చినా ఒకరినొకరు అర్ధం చేసుకొని లెట్ గా పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

Last Updated 18, Nov 2018, 4:59 PM IST