రణ్ వీర్ - దీపిక.. నూతన వధూవరులు వచ్చేశారు!

Published : Nov 18, 2018, 04:40 PM IST
రణ్ వీర్ - దీపిక.. నూతన వధూవరులు వచ్చేశారు!

సారాంశం

గత కొంత కాలంగా బాలీవుడ్ లో ప్రేమ విహారాలతో అందరిని ఆశ్చర్యపరిచిన దీపిక - రణ్వీర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారాన్ని ఈ జోడి ఉంచినంత గోప్యంగా ఇంకెవరు ఉంచలేదని చెప్పాలి. బయట ఎన్ని కామెంట్స్ వచ్చినా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. 

ఇక ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతున్నారంటూ దీపిక ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ పీకి బాలీవుడ్ షెకయ్యింది. ఇటలీలోని ప్రముఖ లేక్ కోమోలో రణవీర్‌సింగ్, దీపిక పదుకొనెల వివాహం వైభవంగా జరిగింది. పెద్దగా జనాలు రాకపోయినప్పటికీ  ఇరు కుటుంబాల ఆచారాల ప్రకారం రెండు సార్లు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. కొంకణి - సింధు సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. 

మొత్తానికి పెళ్లి వేడుకలను ముగించుకొని ఇండియాలో అడుగుపెట్టింది ఈ నూతన జంట. ముంబై విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ప్రముఖు బాలీవుడ్ సెలబ్రెటీలు వీరికి ఘన స్వాగతం పలికారు. ఇక అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక ట్రెడిషన్ లుక్ లో నూతనవధూవరులు మీడియా ముందుకు వచ్చి కొన్ని స్టిల్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా కెమెరాలు క్లిక్ అయ్యాయి. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే