రామ్ - పూరి.. టైటిల్ అదేనేమో?

Published : Jan 02, 2019, 05:19 PM IST
రామ్ - పూరి.. టైటిల్ అదేనేమో?

సారాంశం

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు. సినిమా చేయడానికి హీరోలు దొరకలేని పరిస్థితిలో ఎట్టకేలకు రామ్ పోతినేని ఒప్పుకున్నాడు. 

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు. సినిమా చేయడానికి హీరోలు దొరకలేని పరిస్థితిలో ఎట్టకేలకు రామ్ పోతినేని ఒప్పుకున్నాడు. ఈ ఛాన్స్ తో మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని పూరి ఆశలను పెట్టుకున్నాడు. 

ఇకపోతే ఇటీవల ఈ కాంబినేషన్ లో  తెరకెక్కనున్న సినిమాకు టైటిల్ ఇదేనంటూ రెండు మూడు పేర్లు సోషల్ మీడియాలోకి చక్కర్లు కొట్టాయి. పండుగాడు అనే టైటిల్ ని కథకు తగ్గట్టుగా సెట్ చేసినట్లు టాక్ వస్తోంది. అయితే అది ఎంతవరకు నిజం అనేది రేపటితో క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే చిత్ర యూనిట్ టైటిల్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. 

గురువారం సాయంత్రం 4గంటలకు టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. సొంత బ్యానర్ పూరి కనెక్ట్స్ లోనే సినిమాను నిర్మిస్తున్నాడు. కో ప్రొడ్యూసర్ గా ఛార్మి ఎప్పటిలానే మరోసారి పూరితో కలవనుంది. మరి ఈసారైన పూరి సక్సెస్ ను అందుకుంటాడో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం