#DoubleiSmart:'డబుల్‌ ఇస్మార్ట్‌' కి రామ్ కు షాకింగ్ రెమ్యునరేషన్.. ఎంతంటే

By Surya Prakash  |  First Published Feb 2, 2024, 4:31 PM IST

2019లో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'కు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రామ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.



డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. 2019 లో రిలీజైన ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలసిందే. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కావడంతో డబుల్ ఇస్మార్ట్ చేస్తామని పూరి జగన్నాథ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2023 జులై నెలలో పూజ కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన ఈ మూవీ.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ షూటింగ్ ముంబై లో జరిగింది. ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ షూటింగ్ థాయ్ లాండ్ లో జరుపుకోనుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ నేఫద్యంలో ఈ చిత్రం లో నటిస్తున్నందకు రామ్ కు ఎంత ఇవ్వబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నిమిత్తం ..రామ్ కు 25 కోట్లు పే చేస్తున్నట్లు వినికిడి. రామ్ కు ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ పడలేదు. అయినా ఆయన మార్కెట్  చెక్కు చెదరలేదు అనటానికి ఈ రెమ్యునరేషన్ సాక్ష్యం.  ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చ్ 8, 2024న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడినట్లు తెలుస్తోంది. రకరకాల కారణాల వలన షూటింగ్ ఆలస్యం కానుంది . దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఇందులో 'బిగ్ బుల్'గా సంజయ్ దత్‌ కనిపిస్తారని మేకర్స్‌ తెలిపారు. గతంలో కేజీఎఫ్‌ 2లో అధీర పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. ఈ మూవీపై సంజయ్‌ కూడా ట్వీట్‌ చేశాడు. డైరెక్టర్ పూరిజగన్నాధ్,  రామ్ పోతినేనితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపాడు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌లో తాను భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ సంజయ్ పేర్కొన్నాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సంగీతం అందించిన మణిశర్మనే సీక్వెల్‌కూ సంగీతం అందిస్తున్నారు. గతంలోనూ పూరి–మణిశర్మ కాంబినేషన్‌లో ‘పోకిరి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ ఆల్బమ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌ పోర్షన్స్‌ షూటింగ్  కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా సమాచారం.  
 

Latest Videos

click me!