
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే ఎదురైన ఎదురుదెబ్బలకు రామ్ ఆలోచనలో పడ్డాడు. ఇక నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్త పడబోతున్నాడు.రామ్ తన తదుపరి సినిమాను బోయపాటితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను ఇంతకు ముందే ఫిక్స్ చేశారట. కాని ఇప్పుడు పరిణామాలు మారినట్టు తెలుస్తోంది.
అయితే రామ్ నుంచి రీసెంట్ గా వచ్చిన సినిమా 'ది వారియర్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. ఎంత ఊహించి సినిమాకు వెళ్ళారో అంత నిరాశతో ఆడియన్స్ వెనుదిరిగినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపించింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే వైపు నుంచి సినిమా నిరాశపరిచిందని చెప్పుకున్నారు. రామ్ గెటప్ కొత్తగా ఉండటంతో సినిమా కూడా రొటీన్ కి భిన్నంగా ఉంటుంది అనుకున్నారు. కాని రొటీన్ గానే ఉండటంతో సినిమా ప్లాప్ అయ్యిందనే మాటలు వినిపిస్తున్నాయి.
అందుకే రామ్ బోయపాటి విషయంలో ఆలోచనలో పడ్డాడట. కథ ముందే లాక్ చేసుకున్నా.. ఎందుకైనా మంచిది ఇప్పుడు మళ్లీ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అనే ఉద్దేశంతో రామ్ ఉన్నాడని అంటున్నారు. అందుకు మెయిన్ కారణం ది వారియర్ ఎఫెక్ట్' అని తెలుస్తోంది. కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా బోయపాటితో మరింత కసరత్తు చేయిస్తున్నాడని అంటున్నారు. అందునా ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వలన, రామ్ మరింత సీరియస్ గా తీసుకున్నాడని చెబుతున్నారు.
అసలు చాక్లెట్ బాయ్ గా ఉన్న రామ్ పోతీనేని మాస్ హీరోగా మారాలన్న కోరికతో తీవ్రంగా ప్రయత్నించాడు. చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎనర్జిటిక్ హీరో మాస్ హీరోగా మారాడు. ఇక అప్పటి నుంచి వరుసగా మాస్ సినిమాలే చేస్తూ వస్తున్న రామ్.. వరుసగా ఫెయిల్యూర్స్ కూడా ఫేస్ చేస్తున్నాడు. ఆమధ్య రెడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రామ్ ఈ సినిమాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా వారియర్ సినిమాతో మరో ప్లాప్ పడింది.