నటుడిగా అతిలోక సుందరి భర్త, నిర్మాత బోనీ కపూర్‌

Published : Jan 10, 2021, 04:21 PM IST
నటుడిగా అతిలోక సుందరి భర్త, నిర్మాత బోనీ కపూర్‌

సారాంశం

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌`కి బోనీ కపూర్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ఇప్పుడు కెరీర్‌లో మరో స్టెప్‌ తీసుకుంటున్నారు. నటుడిగా మారబోతున్నారు. అంతేకాదు స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కి తండ్రిగా కనిపించనున్నారు.

అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలుగులోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌`కి బోనీ కపూర్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు హిందీలో ఆయన అనేక హిట్‌ చిత్రాలను నిర్మించారు. 

తాజాగా నటుడిగా మారుతున్నారు. అంతేకాదు రణ్‌బీర్‌ కపూర్‌ కి తండ్రిగానూ మరబోతున్నారు. లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో బోనీ కపూర్‌ నటించనున్నారట. రణ్‌ బీర్‌ కపూర్‌కి తండ్రిగా నటించనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

బోనీ కపూర్‌ తెలుగులో గతంలో నాగార్జున హీరోగా రూపొందిన `అంతం` చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీన్ని బోనీ కపూర్‌ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `వకీల్‌సాబ్‌`తోపాటు `మైదాన్‌`, `బధాయి హో` రీమేక్‌, తమిళంలో `వాలిమై` చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇక ఆయన కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది. మరో కుమారుడు అర్జున్‌ కపూర్‌ హీరోగా రాణిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు