RGV:బాలకృష్ణ అన్ స్టాపబుల్‌షో పై,బన్నీపై ఆర్జీవీ ట్వీట్స్, వెంటనే డిలీట్

Surya Prakash   | Asianet News
Published : Jan 20, 2022, 07:28 AM IST
RGV:బాలకృష్ణ అన్ స్టాపబుల్‌షో పై,బన్నీపై ఆర్జీవీ ట్వీట్స్, వెంటనే డిలీట్

సారాంశం

  బాలకృష్ణ అన్ స్టాపబుల్‌షో పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అన్ స్టాపబుల్‌షోలో తనకు పాల్గొనాలని ఉందంటూ ట్వీట్ చేశారు వర్మ. బాలకృష్ణ తనకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు రామ్ గోపాల్ వర్మ.

సాధారణంగా ఓడ్కా తాగుతూ వచ్చే ఆలోచనలను ట్వీట్స్ గా పేర్చటం వర్మకు అలవాటు. వాటిల్లో ఎక్కువ శాతం వివాదాస్పద ట్వీట్సే ఉంటాయి.  ఫలానాది నచ్చిందని పాజిటివ్ కామెంట్స్ చేయడం వంటివి చేయడం చాలా అరుదనే చెప్పాలి. కానీ తాజాగా బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న “అన్‌స్టాపబుల్” కార్యక్రమానికి వర్మ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అలాగే   అన్‌స్టాపబుల్‌ కార్యక్రమం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ఈ షోలో పాల్గొని మాట్లాడాలనుకుంటున్నానని, బాలయ్య గారు ఈ అవకాశం ఇస్తారని అనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. అయితే ఈ లోగా ఆయన మనస్సుకు ఏమి అనిపించిందో ఏమిటో..  వర్మ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయ్యిపోయింది. ఇంతకీ వర్మను బాలయ్య తన షోకు ఆహ్వానిస్తారా? అనేది చూడాలి.  

ఇదిలా ఉండగా రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పదమైన ట్వీట్ చేశాడు. ఈసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మెగా ఫ్యామిలీ లో మెగాస్టార్ అంటే అల్లు అర్జున్ ఒక్కడేనేని అన్నారు. చిరంజీవి ఫ్యామిలీ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఒక్కడే మెగాస్టార్ అని, భవిష్యత్ లో ఇది నిజమవుతుందని వర్మ ట్వీట్ చేశాడు. రజనీకకాంత్ కంటే.... సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే ఎక్కువ క్రేజ్ అల్లు అర్జున్ కు ఉంటుందని వర్మ అన్నాడు. అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటి తర్వాత వర్మ దానిని డిలీట్ చేశాడు.  

మరో ప్రక్క రామ్‌గోపాల్ వర్మ మంత్రి కొడాలి నానిపై సెటైరికల్ ట్వీట్ చేశారు. గుడివాడలో గోవా కల్చర్‌ను తీసుకురావడంపై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. గుడివాడను లండన్, పారిస్, లాస్‌వెగాస్‌‌ల సరసన నిలిపారని గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లిన ఫీలింగ్‌ను మంత్రి కొడాలి నాని కల్పించారంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద