Radhe Shyam: రాధే శ్యామ్ కోసం 1970ల నాటి ఇటలీ దేశాన్ని ఎలా సృష్టించారో తెలుసా?

By Sambi ReddyFirst Published Jan 20, 2022, 7:12 AM IST
Highlights

రాధే శ్యామ్ చిత్రం కోసం 1970ల నాటి ఇటలీ (Italy) దేశ పరిస్థితులు తెరపై చూపించడానికి చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారట. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రవీందర్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

పీరియాడిక్ చిత్రాలు తీయడం మేకర్స్ కి ఛాలెంజ్ తో కూడుకున్న వ్యవహారం. ఇందులో చాలా రిస్క్ ఉంటుంది. ఆనాటి పరిస్థితులు, వాతావరణం, వస్తువులు, పరిసరాలు, కల్చర్, మనుషులు, మాట తీరు ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా ఈజీగా దొరికిపోతాం. మరి స్టార్ హీరోలు నటించే పాన్ ఇండియా చిత్రాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రభాస్ రాధే శ్యామ్ (Radhe Shyam)మూవీ 1970ల నాటి కథగా తెరకెక్కుతుంది. అందులోనూ సినిమా అధిక భాగంగా ఇటలీలో నేపథ్యంలో సాగుతుంది. 

మరి 1970ల నాటి ఇటలీ (Italy) దేశ పరిస్థితులు తెరపై చూపించడానికి చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారట. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రవీందర్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.రాధే శ్యామ్ సినిమా కోసం దాదాపు రెండేళ్లు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇటలీ 1970ల నాటి పరిస్థితులను అధ్యయనం చేశారట. ఇక 70 మందితో కూడిన బృందం ఇటలీలో పర్యటించడం జరిగిందట. రాధే శ్యామ్ మూవీలో కనిపించే లొకేషన్స్, వస్తువులు ఆ కాలానికి సంబంధించినవిగా ఉండేలా కష్టపడ్డారట. 

రాధే శ్యామ్ మూవీలో కనిపించే ఫర్నిచర్, ఫైర్ క్రాకర్స్, అద్దం, టెలిఫోన్ ఇలా ప్రతి వస్తువు సహజంగా కనిపించేలా పెద్ద ప్రయత్నమే చేశారట. రాధే శ్యామ్ ట్రైలర్, టీజర్స్  చూస్తే ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం, క్రియేటివిటీ మనకు అర్థమవుతుంది. రాధే శ్యామ్ షూటింగ్ దాదాపు ఇటలీలో ప్లాన్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అది కుదరలేదు. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ఏర్పడగా... హైదరాబాద్ లో ఇటలీ దేశాన్ని తలపించేలా సెట్స్ వేశారు. కొంత భాగం షూటింగ్ సెట్స్ లో పూర్తి చేశారు. 

ప్రేక్షకుడికి ఓ గొప్ప అనుభూతి పంచడానికి చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారు. దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే (Pooja hegde) నటించారు. ప్రభాస్ ఈ మూవీలో హస్తసాముద్రికుడి రోల్ చేస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన రాధే శ్యామ్ కరోనా (Corona virus)ఆంక్షల కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి లేదా మార్చ్ లో రాధే శ్యామ్ విడుదల ఉండే అవకాశం కలదు. 

ప్రభాస్ (Prabhas)నుండి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ప్రభాస్ చివరి చిత్రం సాహో 2019లో విడుదలైంది. రాధే శ్యామ్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. రాధే శ్యామ్ విడుదల వాయిదా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. మరోవైపు 2022లో ప్రభాస్ నుండి మరో రెండు చిత్రాలు రానున్నాయి. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. ఇక ప్రభాస్ ఫస్ట్ మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్ ఆగస్టులో విడుదల కావాల్సి ఉంది. 

click me!