RGV కి ఘాటైన బర్త్ డే గిఫ్ట్ ... వర్మను ముద్దుల్లో ముంచెత్తిన హీరోయిన్

Published : Apr 09, 2022, 07:28 AM ISTUpdated : Apr 09, 2022, 07:36 AM IST
RGV కి ఘాటైన బర్త్ డే గిఫ్ట్ ... వర్మను ముద్దుల్లో ముంచెత్తిన హీరోయిన్

సారాంశం

రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా స్పెషల్ గానే ఉంటుంది. ఏ మాట్లాడినా వివాదం అవుతుంది. ఎక్కడికి వెళ్లినా ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది. ఇక ఆయన పార్టీ చేసుకున్నాడంటే.. ఏదో ఒక విశేషం బయట పడినట్టే..అది ఆయన బర్త్ డే పార్టీ అయితే ఇంక చెప్పాల్సి అవసరమే లేదు. 

రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా స్పెషల్ గానే ఉంటుంది. ఏ మాట్లాడినా వివాదం అవుతుంది. ఎక్కడికి వెళ్లినా ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది. ఇక ఆయన పార్టీ చేసుకున్నాడంటే.. ఏదో ఒక విశేషం బయట పడినట్టే..అది ఆయన బర్త్ డే పార్టీ అయితే ఇంక చెప్పాల్సి అవసరమే లేదు. 

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.  కాంట్రవర్సియల్ కింగ్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా సినిమా డేంజరస్‌.. ఈ మూవీ రిలీజ్.. ఆయన బర్త్ డే ఒకే రోజు వచ్చాయి కాని.. అనూహ్యంగా ఈమూవీ రిలీజ్ ఆగిపోయింది. కాని వర్మ  బర్త్ డే పార్టీ మాత్రం గ్రాండ్ గా జరిగింది. వర్మ పార్టీ కి వెళ్ళారు అంటే.. అందులో ఏదో ఒక స్పెషల్ తప్పకుండా ఉంటుంది. ఈసారి కూడా అంతే రేంజ్ లో అదరగొట్టాడు వర్మ. 

గురువారం (ఏప్రిల్‌ 7) ఆర్జీవీ బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన  పార్టీకి  పలువురు సెలబ్రిటీలు సహా.. మా ఇష్టం మూవీ హీరోయిన్ నైనా గంగూలీ అతిథులుగా వచ్చారు. మాములు పార్టీలే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తారు వర్మ.. ఇక తన బర్త్ డే పార్టీ అంటే ఎ ఉండాలి..డబుల్ ఫుల్‌గా ఎంజాయ్‌ చేసిన వర్మ పార్టీలో ఓ చేతిలో మందు మందుగ్లాసు, మరో చేతితో నైనాను పట్టుకున్నాడు. 

 

 

అంతటితో ఆగాడా అంటే అదీ లేదు. నైనాతో కలిసి తెగ సందడి చేశాడు. ఇక హీరోయిన్ కూడా వర్మతో క్లోజ్ గా మూవ్ అవ్వడంతో పాటు.. ఈ సందర్భంగా నైనా గంగూలీ హ్యాపీ బర్త్‌డే అంటూ వర్మ బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ వీడియోను స్వయంగా ఆ హీరోయినే తన సోషల్‌ మీడియా పేజ్ లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

లెస్బియన్‌ నేపథ్యంలో రూపొందిన డేంజరస్ సినిమాను రిలీజ్‌ చేయడం కోసం వర్మ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. సరిగ్గా రిలీజ్ చేసే రోజుకు కొన్ని మల్టీ ప్లెక్స్ థియేటర్లు ఈ సినిమాను రిలీజ్ చేయడం కోసం వ్యాతిరేకత  వ్యక్తం చేయడంతో రిలీజ్  వాయిదా పడింది. ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్లుగా నటించారు. ఈ విషయంలో పోరాటానికి రెడీ అవుతున్నారు రామ్ గోపాల్ వర్మ. 
 

PREV
click me!

Recommended Stories

ఆ ఒక్క ఇన్సిడెంట్‌తో సినిమాలకు దూరం.. 35 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ.. ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా