Vyooham Postponed : రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ మళ్లీ వాయిదా.. ఈసారి ఏమైందంటే?

Published : Feb 22, 2024, 09:13 PM IST
Vyooham Postponed : రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ మళ్లీ వాయిదా.. ఈసారి ఏమైందంటే?

సారాంశం

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)  ‘వ్యూహం’ (Vyooham Movie)  మళ్లీ వాయిదా పడింది. ఈసారి కారణం నారా లోకేష్ కాదంటూ చెప్పుకొచ్చారు. మరీ పోస్ట్ పోన్ రీజన్ ఏమని చెప్పారంటే.. 

‘వ్యూహం’ సినిమాకు నారా లోకేష్ Nara Lokesh అడ్డుపడ్డారంటూ రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma మొన్నటి వరకు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి ఆయన కారణం కాదని ఆర్జీవీనే స్వయంగా చెప్పుకొచ్చారు. డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)  ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా ‘వ్యూహం’. ఈ చిత్రం మొదటి నుంచి వివాదాలను ఎదుర్కొంటూనే వచ్చింది. ఎట్టకేళకు మొన్న రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 

ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అంటే రేపు థియేటర్లలో విడుదల కావాలి. కానీ సినిమా వాయిదా పడిందంటూ రామ్ గోపాల్ వర్మ తాజాగా అప్డేట్ ఇచ్చారు. Vyooham Movie Postponeకి కారణం కూడా చెప్పారు. మొన్నటి వరకు నారా లోకేష్ అడ్డుపడ్డారని చెప్పిన ఆర్జీవీ మాత్రం ఈసారి ఆయన కాదని క్లారిటీ ఇచ్చారు. 

ఈసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమాను వాయిదా వేసినట్టు తెలిపారు. మార్చి 1న ‘వ్యూహం’, మార్చి 8న శపథం సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిపారు. అయితే తమకు కావాల్సిన థియేటర్లు ఆ రెండు డేట్లలో అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. ఇక ఈ సినిమాను ఆర్జీవీ ఏ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారో తెలిసిందే. 

వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమాలే ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీస్ లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్ అడ్డంకులు దాటుకున్న ఈ చిత్రాలు మార్చి 1, 8న విడుదల కాబోతున్నాయి.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?