ఎవరితో పడుకోవాలో కూడా కరణే చెప్తాడు.. కంగనా సోదరి కామెంట్స్!

Published : May 28, 2019, 04:28 PM IST
ఎవరితో పడుకోవాలో కూడా కరణే చెప్తాడు.. కంగనా సోదరి  కామెంట్స్!

సారాంశం

కంగనా రనౌత్ సోదరి రంగోలి బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటుంది. 

కంగనా రనౌత్ సోదరి రంగోలి బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో హృతిక్ రోషన్, రిచా చద్దా, వివేక్ ఒబెరాయ్ వంటి నటుల గురించి సోషల్ మీడియాలో విమర్శలు చేసిన రంగోలి తాజాగా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ని టార్గెట్ చేసింది. 

దీనికి కారణం ముందుగా నటుడు కేఆర్కే తన ట్విట్టర్ పెట్టిన ట్వీట్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. కరణ్ జోహార్ నటుడు ఇషాన్ ఖట్టర్ని ధర్మ ప్రొడక్షన్స్ నుండి వెళ్లగొట్టినట్లు, ఇషాన్.. కరణ్ తో పొగరుగా మాట్లాడడం వలనే అలా చేశారని రాసుకొచ్చారు.

ఇది చూసిన రంగోలి.. కరణ్ లాంటి వ్యక్తికి ఇది చాలా చిన్న విషయమని తనకు తెలిసి కరణ్.. ఇషాన్ ని ఏదైనా విషయంలో ఫోర్స్ చేసి ఉంటారని, దానికి ఇషాన్ అంగీకరించకపోవడంతో ఇలా చేసి ఉంటాడని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

కరణ్ తనతో కలిసి పని చేసే నటీనటుల నుండి కొంత పెర్సంటేజ్ చొప్పున డబ్బు తీసుకోవడంతో పాటు వారు ఎలాంటి బట్టలు వేసుకోవాలి..? ఎవరితో పడుకోవాలనే విషయాలను కూడా చెబుతుంటారని సంచలన కామెంట్స్ చేసింది. ఇషాన్ ని కూడా ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది పెట్టి ఉంటాడని పరోక్షంగా చెప్పుకొచ్చింది.   

PREV
click me!

Recommended Stories

Dhandoraa First Review: శివాజీ 'దండోరా' మూవీ ఫస్ట్ రివ్యూ.. కాంట్రవర్షియల్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టేశారా ?
దళపతి విజయ్ టీమ్‌కు మలేషియా పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, ఎందుకంటే?