మెగా సూపర్ స్టార్లు ప్రభాస్ కాలిగోటికి సరిపోరు...ఇంకా చాలా అంటున్న వర్మ

Published : Mar 17, 2017, 11:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మెగా సూపర్ స్టార్లు ప్రభాస్ కాలిగోటికి సరిపోరు...ఇంకా చాలా అంటున్న వర్మ

సారాంశం

టాలీవుడ్ హీరోలపై రామ్ గోపాల్ వర్మ హాట్ కమెంట్స్ స్టార్ హీరోలు ప్రభాస్ కాలిగోటికి సరిపోరంటున్న వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వర్మ చేసే రచ్చ మామూలుగా ఉండదు. కత్తులతో కాదురా... ట్వీట్లతో చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కాలు దువ్వేస్తున్న వర్మ ట్విట్టర్లో తాజాగా చేసిన ట్వీట్లు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ట్రైలర్‌ సినిమాలకు అమ్మమ్మలా ఉందని నిన్న వ్యాఖ్యానించిన ఆయన ఈరోజు ప్రభాస్‌ ఇమేజ్‌ను కీర్తిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

 

‘టాలీవుడ్‌ పవర్‌ఫుల్‌ స్టార్లు జాతీయ స్థాయిలో ప్రయత్నించి ఘోరంగా విఫలమై ప్రాంతీయానికి పరిమితమై అయిపోయారు. ప్రభాస్‌ రెండు దెబ్బలతో అంతర్జాతీయ స్టార్‌ అయిపోయాడు. బాహుబలి-2 తర్వాత టాలీవుడ్‌లో పవర్‌ఫుల్లెస్ట్‌ మెగా సూపర్‌స్టార్లకి ప్రభాస్‌ కాలి గోటినందుకోవడానికి రెండున్నర జన్మలు పడుతుంది. ముంబయిలోని ఐదు అతిపెద్ద కంపెనీలు ప్రభాస్‌తో చాలా సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటున్నారు. బాహుబలి 2 ట్రైలర్‌ వ్యూస్‌ సంఖ్యను చూసి టాలీవుడ్‌లో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో అని భయంగా ఉంది.’ ట్వీటర్‌ వేదికగా వరుస ట్వీట్లతో వర్మ సునామీ సృష్టిస్తున్నాడు. మరి దీనిపై ఆయనకు ఎలాంటి కౌంటర్స్ వస్తాయో చూడాలి..

 

PREV
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?