నేను 'గే' కాదు.. వర్మ ట్వీట్లు..!

By Udaya DFirst Published Apr 1, 2019, 3:24 PM IST
Highlights

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'మజిలీ'. పెళ్లి తరువాత చైతు, సామ్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'మజిలీ'. పెళ్లి తరువాత చైతు, సామ్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నిన్న జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటుడు వెంకటేష్ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 'f..' అంటూ తనకొచ్చిన బూతులు వాడుతూ ట్రైలర్ ఎలా ఉందో వివరించారు. ఆ వెంటనే మరో ట్వీట్ చేశారు.

అందులో హీరో నాగచైతన్యపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టాడు.

''అవును నాగచైతన్య, ఇంతకముందు ట్వీట్ చేసేటప్పటికీ నేను నాలుగు పెగ్గుల వోడ్కా తాగాను. కానీ.. ఒకవేళ నేను వోడ్కా తాగుండకపోతే పరిస్థితి వరస్ట్ గా ఉండేది. అసలు విషయం ఏంటంటే.. ట్రైలర్ లో సమంత కంటే నువ్వే బాగా నచ్చావు. నేను 'గే'ని కాను.. అసలు నిజం ఏంటంటే.. ఆమెను నీకంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పెట్టిన కాసేపటికే వర్మ డిలీట్ చేసేశాడు. 

click me!