ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలపై లేటెస్ట్ అప్డేట్!

Published : Apr 01, 2019, 03:11 PM IST
ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలపై లేటెస్ట్ అప్డేట్!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.

అయితే సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ఏపీలో సినిమాను విడుదల కాకుండా అక్కడి హైకోర్టు స్టే విధించింది. దీంతో సినిమా ఏపీలో తప్ప ప్రపంచవ్యాప్తంగా 
విడుదలైంది. దీంతో చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. 

చిత్ర విడుదలపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని కోరిన పిటిషనర్ కోరారు. ఏపీలో సినిమా కచ్చితంగా విడుదలవుతుందని రాకేశ్ రెడ్డి చెప్పారు.

సినిమాలో వాస్తవాలనే చూపించామని.. సెన్సార్ బోర్డ్ అనుమతి కూడా నిలిపివేయడం సరికాదని, సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు.  

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌