ఆర్ఆర్ఆర్ ఒక సర్కస్... ఆ డైరెక్టర్ సినిమాలు నచ్చవన్న రామ్ గోపాల్ వర్మ

Published : Aug 23, 2022, 02:18 PM IST
ఆర్ఆర్ఆర్  ఒక  సర్కస్... ఆ డైరెక్టర్ సినిమాలు నచ్చవన్న రామ్ గోపాల్ వర్మ

సారాంశం

వివాదాల దర్శకుడు.. సంచలనాలకు మారు పేరు రామ్ గోపాల్ వర్మ.. మరో బాంబ్ పేల్చాడు. ట్రిపుల్ ఆర్ సినిమాను సర్కస్ తో పోల్చిన ఆయన .. సినిమాల గురించి రకరకాల అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంతకీ వర్మ ఏమన్నాడంటే..?   

దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా  ఘనజయాన్ని సాధించి.. హాలీవుడ్ మేకరస్స్ తోనే శభాస్ అనిపించుకున్న సినిమా  ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు ఒక సర్కలా అనిపించిందని  కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు వర్మ.  సర్కస్ చూస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో... ఈ సినిమా చూసినా అదే ఫీలింగ్ కలిగిందన్నారు. 

ముఖ్యంగా బ్రిడ్జి దగ్గర ఒక కుర్రాడిని క కాపాడే సీన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా జెమినీ సర్కస్ చేస్తున్న ఫీలింగ్ తనకు కలిగిందని అన్నారు ఆర్జీవి. అనేవన్నీ అంటూనే.. తాను మాట్లాడిన మాటలు తప్పుగా ర్ధం చేసుకోవద్దని కూడా వర్మ కోరడం విచిత్రం.  తన అభిప్రాయం ప్రకారం... ట్రిపుల్ ఆర్ ను నేను విమర్షించడంలేదు..  సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి జోష్ కలుగుతుందో అలాంటిదే ఈ సినిమా చూస్తున్నప్పుడు తనకు కలిగిందని  అన్నాను అంతే అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు వర్మ.  

ఇంకా చాలా విషయాల గురించి ఇలానే మాట్లాడారు వర్మ.  ఒక సినిమా మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. కాలేజీ రోజుల్లో తనకు కమ్యూనిస్టు భావజాలం ఉండేదని వర్మ తెలిపారు. అయితే అయాన్ ర్యాండ్ పుస్తకాలను చదవడాన్ని ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి తనలో మార్పు వచ్చిందని చెప్పారు. తాను తనతో సహా ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోనని అన్నారు. 

మరికోన్ని  విషయాలు కూడా ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు వర్మ. ముఖ్యంగా తాను వోడ్కాలోకి పల్లీలను స్టఫ్ గా తీసుకోవడాన్ని ఇష్టపడతానని చెప్పారు. ఆయన మూవీస్ గురించి ప్రశ్న రాగా.. తన కెరీర్ లో కేవలం క్షణక్షణం, సర్కార్ సినిమాలను మాత్రమే పక్కా స్క్రిప్ట్, దానికి సరిగ్గా సరిపోయే నటులతో తీశానని... మిగిలిన సినిమాలేవీ కూడా ఫలానా నటుడితో చేయాలనుకుని చేయలేదని అన్నారు. 

తెరపై హీరోయిన్లను తనకంటే అందంగా ఎవరూ చూపించలేరని వర్మ చెప్పారు. ఇక తన జీవితంలో మణిరత్నం సినిమాలు తనకు నచ్చవని స్పష్టం చేశారు. ఒకసారి తామిద్దరం కలిసి స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నామని... ఆయన తన మాట వినలేదని, తాను ఆయన మాట వినలేదని చెప్పారు. ఇలా రకరకాల ప్రశ్నలకు అటి తిరిగి..ఇటు తిరిగి తాను చెప్పాలి అనుకన్న సమాధానమే చెపుతారు స్టార్ డైరెక్టర్. మరి ఈ వ్యాఖ్యలైపై ఎవరు ఎలా స్పిందిస్తారోచూడాలి. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?