గుండెపోటుతో హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మృతి.. నిన్న రాత్రే ఇలా చేసింది.!

By team teluguFirst Published Aug 23, 2022, 1:36 PM IST
Highlights

బాలీవుడ్ నటి, హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తాజాగా గుండెపోటుతో కన్నుమూసింది. ముందు రోజు వరకు ఆరోగ్యంగానే కనిపించిన ఆమె ప్రాణాలు కోల్పోవడంతో పలువురు సినీ తారలు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. 
 

బాలీవుడ్ నటి, హిందీ బిగ్ బాస్ (Hindi Bigg Boss) మాజీ కంటెస్టెంట్ సొనాలీ ఫోగట్ (Sonali Phoga) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 41 ఏండ్ల వయస్సులోనే సోనాలీ మరణవార్త వినాల్సి రావడంతో తోటీ నటీనటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోనాలీ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలో నివసిస్తున్న ఈమె తన నివాసంలోనే కన్నుమూసినట్టు సమాచారం. కానీ సోనాలి ఫోగట్ మరణానికి ఖచ్చితమైన కారణాన్ని ఇటు కుటుంబం సభ్యులు, అటు అధికారులు  ఇప్పటివరకు ధృవీకరించలేదు. 

సోనాలీ మరణించటానికి ముందు రోజు వరకు కూడా ఆరోగ్యంగానే ఉంది. తన అభిమానులు, ఫాలోవర్స్ తో ఓ పోస్ట్ ను కూడా పంచుకుంది. తన గ్లామర్ పిక్ ను షేర్ చేయడంతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ఇంత యాక్టివ్ గా ఉన్న సోనాలీ ఒక్కసారిగా ప్రాణాలో కోల్పోవడం పట్ల ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇటు ‘బిగ్ బాస్ 14’ సహ కంటెస్టెంట్లు పవిత్ర పునియా, అలీ గోని మరియు అర్షి ఖాన్ కూడా ఆమె ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఆమె అంత్యక్రియలు గోవాలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. 

2016లో సోనాలి ఫోగట్‘అమ్మ’ అనే టీవీ షోతో తన కేరీర్ ను ప్రారంభించింది. 2019లో ‘ది స్టోరీ ఆఫ్ బద్మాష్‌ గఢ్’ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. అలాగే టిక్ టాక్ లాంటి పాపులర్ యాప్ లోనూ క్రేజీ వీడియోలతో క్రేజ్ పెంచుకుంది. అలాగూ దూరదర్శన్‌లోనూ కొన్నాళ్లు యాంకర్‌గా పనిచేసింది. ఆ తర్వాత టీవీ రంగంలోకి వచ్చి తన వృత్తిని కొనసాగిస్తూనే.. అటు రాజకీయం వైపు అడుగులేసింది. మూడేండ్ల కిందనే బీజేపీలో చేరి వర్కింగ్ కమిటీలో సేవలందిస్తోంది. గోవాలో బీజేపీ నాయకురాలిగా సోనాలి ఫోగట్ ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటోంది. ఆమె 2019 సాధారణ ఎన్నికలలో హర్యానాలోని అడంపూర్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయింది.

 

click me!