'మా' సభ్యులందరూ సర్కర్ లో జోకర్స్... మళ్ళీ రెచ్చిపోయిన వర్మ!

By team telugu  |  First Published Oct 19, 2021, 2:49 PM IST

MAA elections నేపథ్యంలో సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడగా, వాటిని ఉద్దేశిస్తూ.. వర్మ ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు. మా ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించడం జరిగింది.


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులపై అనుచిత కామెంట్స్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. వరుస ట్వీట్స్ చేస్తూ, నటులకు ఝలక్ ఇస్తున్నారు. MAA elections నేపథ్యంలో సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడగా, వాటిని ఉద్దేశిస్తూ.. వర్మ ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు. మా ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిచి, అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. 


ఎన్నికల ముందు మొదలైన రచ్చ ఫలితాల అనంతరం కూడా ఆగలేదు. Prakash raj ప్యానెల్ తరపున గెలిచిన శ్రీకాంత్, బెనర్జీ, ఉత్తేజ్ లతో పాటు 8మంది ఈసీ సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని, మోహన్ బాబు తమ ప్యానెల్ సభ్యులను  కొట్టడం, తిట్టడం వంటి అసాంఘిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. 

Latest Videos

undefined


మా ఎన్నికల్లో ఇరు పక్షాలకు మద్దతుదారులుగా ఉన్నవారు, ఎన్నికలలో నిలబడిన సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగారు. గతంలో ఎన్నడూ లేనంత రచ్చ, వివాదాలు మా ఎన్నికలలో చోటు చేసుకున్నాయి. ప్రకాష్ రాజ్ కి మద్దతుగా ఉన్న చిరంజీవి, పవన్ పరోక్షంగా, నాగబాబు ప్రత్యక్షంగా వివాదాలలో చిక్కుకున్నారు. అటువైపు నుండి Mohan babu, నరేష్, మంచు విష్ణు మాటల దాడి చేయడం జరిగింది. 

Also read ముక్కు అవినాష్ ఇంటిలో పెళ్లి సందడి.. హల్దీ వేడుక ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!
మా ఎన్నికల సాక్షిగా పరిశ్రమ పరువు, నటుల విలువలు పోయాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అయితే ఈ పరిణామాలను ఉద్దేశిస్తూ పుండు మీద కారం చల్లుతున్నాడు వర్మ. మా సభ్యులు గౌరవం పోగొట్టుకున్నారని అర్థం వచ్చేలా... మా అనేది ఒక సర్కస్, సభ్యులు అందరూ జోకర్లు అంటూ ట్వీట్ చేశాడు. అలాగే మరో ట్వీట్ లో మా సభ్యులు తాము సర్కస్ వాళ్లమని నిరూపించుకున్నారంటూ.. కామెంట్ చేశారు. 

Also read ఈటల-కేసీఆర్ ఎపిసోడ్... వెన్నుపోటు టైటిల్ తో వర్మ సంచలన చిత్రం!
ఎన్నికల పేరుతో మా పరువును బజారున పడేశారని ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు నొచ్చుకుంటున్నారు. వారి బాధను మరింత పెంచేలా Ram gopal varma వరుస ట్వీట్స్,ఇబ్బంది పెడుతున్నాయి. దాదాపు 900 మంది సభ్యులు ఉన్న మాలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,కృష్ణ, వెంకటేష్ ఇలా ఆ తరం ముందు ఈ తరం వరకు అనేక మంది స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరిని జోకర్స్ అని వర్మ అనడం దారుణం అని చెప్పాలి.

Cine”MAA” is a CIRCUS full of JOKERS

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!