ఏపీ రాజకీయాలపై వర్మ సెటైర్... బాక్సింగ్, కర్రసాము నేర్చుకోండి అంటూ..

Published : Oct 21, 2021, 01:13 PM IST
ఏపీ రాజకీయాలపై వర్మ సెటైర్... బాక్సింగ్, కర్రసాము నేర్చుకోండి అంటూ..

సారాంశం

CM jagan పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 

ఆంధ్రప్రధేశ్ లో రాజకీయం వేడెక్కింది. టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్ పై చేసిన ఆరోపణలు, వాడిన పదజాలానికి నిరసనగా TDP కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు టీడీపీ ఆపీసులపై దాడి జరిగింది. ఈ దాడులతో మాకు సంబంధం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది నారా చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగమే అంటూ ఆరోపిస్తున్నారు. నిజం ఏదైనా టీడీపీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ.. పార్టీ అధ్యక్షుడు Nara Chandrababu naidu 36గంటల దీక్షకు దిగారు. 


మరోవైపు CM jagan పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ పరిణామాలను ఉద్దేశిస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు.  ‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్‌, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది’’.. అంటూ ట్వీట్ చేశారు. 

Also read కొండా మూవీని ఎవరూ ఆపలేరు.. తెలంగాణా మంత్రికి వర్మ మాస్ వార్నింగ్!
నేతల మధ్య ఆవేశాలు కట్టలు దాటుతుండగా... ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడానికి, దాడుల నుండి కాపాడుకోవడానికి యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న అర్థంలో వర్మ... ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం Ram gopal varma కొండా మూవీ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణా కాంగ్రెస్ నేత కొండా సురేఖ, ఆమె భర్త మురళి జీవిత కథ ఆధారంగా కొండా చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 
Aslo read 'మా' సభ్యులందరూ సర్కర్ లో జోకర్స్... మళ్ళీ రెచ్చిపోయిన వర్మ!

ఈ చిత్రంపై కొందరు టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఓ తెలంగాణా మంత్రి నుండి వర్మకు బెదింపులు కూడా ఎదురవుతున్నాయట. సదరు సవాళ్ళను ఉద్దేశిస్తూ నిన్న వర్మ ఓ ట్వీట్ చేశారు. తన సినిమాను ఎవరూ ఆపలేరంటూ వార్నింగ్ విసిరారు. వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు