ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ పాజిటీవ్ పోస్ట్.. ఏం పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..

By Mahesh Jujjuri  |  First Published Jun 4, 2024, 10:32 PM IST

కూటమితో పాటు..పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సాధించిన ఘన విజయానికి అభినందనల వెల్లువ కురుస్తోంది. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ పై ఆర్జీవి ఓ ట్వీట్ వదిలారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్అవుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా..? 


ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ భారీ విజయంతో పాటు.. జనసేన కూడా పోటీ చేసిన అన్ని చోట్లు విజయం సాధించింది. దాంతో పవర్ స్టార్ తన పంతం నెగ్గిచుకున్నారు. ఈక్రమంలో పవన్ కు అన్నిరంగాల నుంచి వరుసగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరీముఖ్యంగా సినిమారంగం నుంచి పవన్ ను విష్ చేస్తు ట్వీట్లు చేస్తున్నారు సెలబ్రిటీల్. ఈక్రమంలో అందరి చూపు ఒకరిపై ఉంది.. ఆయనే రామ్ గోపాల్ వర్మ. 

ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్షించే రామ్ గోపాల్ వర్మ.. ఈ భారీ గెలుపుతో ఎలా స్పందిస్తారు అని అంతా ఎదురు చూశారు. ఈక్రమంలో ఆర్జీవీస్పందనరానే వచ్చింది. ఆయన స్పందన చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆర్జీవిలో ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అని షాక్ అయ్యారు. ఇంతకీ ఆయన ఏమనిస్పందించారోతెలుసా..? 

Latest Videos

 

Hey 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

— Ram Gopal Varma (@RGVzoomin)

ఆర్జీవీ ఏం రాయలేదు.. అలా అని నెగెటీవ్ గాకూడా పెట్టలేదు. పవర్ కళ్యాన్ పేరు రాసి.. ఓదండం సింబల్ పెట్టేశారు.. నువ్వు నిజంగా గొప్పోడి స్వామి అన్నట్టుగా దండం పెడుతున్న గుర్తులను పెట్టాడు ఆర్జీవి. ఇన్నాళ్లు పవన్ ను చేతగాని వాడిలా ప్రచారం చేసిన రామ్ గోపాల్ వర్మకు.. ఆయన విజయం చూశాకు ఓ క్లారిటీ వచ్చినట్టుంది. నోట మాట కూడా రాలేదని ఆయన ట్వీట్ చూస్తేనే అర్ధం అవుతోంది.

ఇక పవర్ స్టార్ కు వరుసగా సినిమా సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయానికి.. నాతో పాటు మా కుటుంబం అంతా గర్వంగా ఫీల్ అవుతోంది అంటూ శుభాకాంక్షలు తెలిపారు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 

A proud day for our family! Congratulations to my Garu on his phenomenal win!

— Ram Charan (@AlwaysRamCharan)

అటు మోహన్ బాబు కూడా పవర్ స్టార్ తో పాటు.. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ.. లోకేష్ లకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. మీ నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అద్భుత విజయాలు సాధిస్తుందతి అనడంలో ఏ సందేహం లేదు అన్నారు మోహాన్ బాబు. 

ఇక వీరితో పాటు.. నిఖిల్ సిద్దార్ధ్, సందీప్ కిషన్, గోపీచంద్ మలినేని.. నాగ వంశీ.. అడివి శేష్.. సుధీర్ బాబు తో పాటు పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాన్ తో పాటు బాలయ్య బాబుకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

  

click me!